ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు చందేరీ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ ప్రాంత పర్యటన సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రత 14 నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. అందువల్ల, ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇది.
ఎండాకాలం ఎండాకాలం లో 46 డిగ్రీల వరకు చందేరీలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండా ప్రతాపం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఈ సమయం అనువుగా ఉండదు. మార్చ్ లో మొదలయ్యే ఎండాకాలం మే వరకు కొనసాగుతుంది.
వర్షాకాలం జూన్ మొదటి వారం లో మొదలయ్యే వర్షాకాలం ఆగస్ట్ చివరి వరకు లేదా సెప్టెంబర్ ప్రారంభం వరకు ఉంటుంది. తరచూ కురిసే చిరుజల్లులు ఎండాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. వర్షాకాలం లో 700 నుండి 1100 మిమి వరకు వర్షపాతం నమోదవుతుంది.
శీతాకాలం చందేరీ లో శీతాకాలం ఆహ్లాదంగా ఉంటుంది. నవంబర్ లో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. 5 డిగ్రీలకి ఉష్ణోగ్రత పడిపోతుంది. చందేరీ ని సందర్శిచేందుకు ఈ సమయం అనువైనది.