చిక్కబల్లాపూర్ వాతావరణంచిక్కబల్లాపూర్ సందర్శన అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది.
వేసవి (మార్చి నుండి మే) - చిక్కబల్లాపూర్ లో వేసవులు చాలా వేడిగా అసౌకర్యంగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలుగాను ఉంటాయి. వేసవి వేడి కారణంగా వేసవిలో పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో ఉంటారు.
వర్షాకాలం (జూన్ నుండి ఆగస్టు) - వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు చెదురు మదురుగా ఉంటాయి. బయట తిరిగేందుకు కష్టంగా ఉంటుంది కనుక పర్యాటకులు ఈ కాలంలో కూడా అధిక సంఖ్యలో సందర్శించరు.
శీతాకాలం ( డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - చిక్కబల్లాపూర్ వాతావరణం శీతాకాలంలో ఆహ్లాదంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుండి 32 డిగ్రీల మధ్య మార్పు చెందుతూంటాయి. పర్యాటకులకు ఎంతో అనువైన సమయం. పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.