విమానమార్గం : చిత్తోర్ ఘడ్ కు దగ్గరగా ఉదయ పూర్ లోనే దబోక్ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుండి 90 కి. మీ. ల దూరంలో ఉన్న దీనిని మహారాణ ప్రతాప్ విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయాన్ని జైపూర్, న్యూ ఢిల్లీ లతో అనుసంధానించారు. విదేశీ పర్యాటకులకు న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దబోక్ విమానాశ్రయానికి చేరడానికి విమానాలు ఉంటాయి.