గ్వెర్నిసీ టీ ఫ్యాక్టరీ నీలగిరి టీ ప్రధాన ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉంది. ప్రసిద్ధ నీలగిరి టీ రుచి చూడకుండా సందర్శన పూర్తి కాదు. ప్రపంచంలో మరెక్కడికి వెళ్ళిన ఈ టీ రుచి రాదు. గ్వెర్నిసీ టీ ఫ్యాక్టరీ లో మాత్రమే ఈ రుచి ఉంటుంది. ఈ కర్మాగారం నుండి తాజాగా తయారు చేసిన టీ పొడి కొనుగోలు అలాగే ఫ్యాక్టరీ లో తయారు చేసిన టీ ని కూడా త్రాగవచ్చు.
ఫ్యాక్టరీ పని గంటలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. ఆ సమయంలో సందర్శకులను అనుమతి ఇస్తారు. పర్యాటకులకు ముడి ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ చివరి దశలో టీ తయారు చేసే వివిధ అనేక అంశాలను ప్రత్యక్షమైన వీక్షణను అందిస్తుంది. మీ పర్యటనలో ఫ్యాక్టరీ సందర్శన తప్పనిసరిగా ఉండాలి.
గ్వెర్నిసీ టీ ఫ్యాక్టరీ చూడటానికి ప్రతి వ్యక్తికి ప్రవేశ రుసుము 10 రూపాయలు వసూలు చేస్తారు. మీరు వాస్తవంగా టీ తయారి గురించి ప్రతిదీ తెలుసుకోవచ్చు.