Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూనూర్ » వాతావరణం

కూనూర్ వాతావరణం

ఒక హిల్ స్టేషన్ అయిన కూనూర్ ఏడాది పొడవునా సందర్శించడానికి అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. వేసవి సీజన్ (మార్చ్ నుండి మే వరకు) సందర్శన మరియు ట్రెక్కింగ్ కార్యకలాపాలు అనువైనది. ప్రకృతి దృశ్యం యొక్క పచ్చదనంను ఆస్వాదించే వారికి వర్షాకాల సమయం సందర్శనకు అనువుగా ఉంటుంది. అయితే భారీ వర్షాల నెలలు సాధ్యమైనంత వరకు వదలిపెట్టవలసి ఉంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి చివరి త్రైమాసికంలో సెలవులు మరియు హనీమూన్ జంటల కోసం ఆదర్శవంతముగా ఉంటుంది.

వేసవి

కూనూర్ లో వేసవి మార్చి నెల నుండి మే నెల వరకు ఉంటుంది. వేసవి సీజన్ లో ఉష్ణోగ్రత మీకు అసౌకర్యం కలిగించకుండా ఎప్పుడూ ఆహ్లాదకరముగా ఉంటుంది. అంతేకాక కూనూర్ లో వేసవిలో ఉదయం చూడటానికి ఒక దృష్టి ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.

వర్షాకాలం

కూనూర్ లో వర్షాకాలం జూన్ నెల నుండి ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఇక్కడ వర్షాకాలం సమయంలో తగురీతిలో చెప్పుకోదగిన వర్షం కురుస్తుంది. వర్షాల సమయంలో ఈ ప్రదేశం తేమగా మారుతుంది. కూనూర్ ప్రయాణం చేయడానికి మంచి సీజన్ కాదు. అయితే వర్షం చూడటానికి ఒక అద్భుతమైన దృష్టి ఉంటుంది. ఆ సమయంలో కూనూర్ యొక్క కొండలు మరియు లోయలు పచ్చ తివాచీలు ధరించి ఉంటాయి.

చలికాలం

కూనూర్ లో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు విస్తరించి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో ఆహ్లాదకరమైన భాగంగా ఉంటుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రత కనీసం10 డిగ్రీల సెల్సియస్ డ్రాప్ అయ్యి ఉంటుంది. శీతాకాలం చల్లని వాతావరణం ఇష్టపడే ప్రయాణికులకు ఆదర్శవంతమైన సమయం అని చెప్పవచ్చు. అయితే మీరు ఈ సీజన్లో కూనూర్ ప్రయాణం ప్రణాళిక ఉంటే మాత్రం తప్పనిసరిగా శీతాకాలం బట్టలు తీసుకువెళ్ళాలి.