ఉత్తమ సీజన్ కుర్తాలం పర్యటనకు వర్షాకాలం మరియు శీతాకాలం అనువైనవి. ఈ సమయం లోని వర్షాలు, ప్రాంత అందాలను పెంచుతాయి. పర్యాటకులకు పర్యటన హాయిగా వుంటుంది.
వేసవి కుర్తాళ్ళంలో వేసవి మార్చ్ నుండి మే వరకు వుంటుంది. వేసవి అధిక వేడి. ఉష్ణోగ్రతలు గరిష్టం 37 డిగ్రీలు కనిష్టం 23 డిగ్రీలు గా వుంటాయి. ఈ సమయం సందర్శనకు పనికి రాదు.
వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షాలు అధికంగా పడతాయి. జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తాయి. నిరంతర జల్లులు, చల్లటి గాలులుతో ఆహ్లాదంగా వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు ఇది మంచి సమయం.
శీతాకాలం కుర్తాలం లో శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. చలి ఒక మోస్తరుగా వుంది వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు గరిష్టం 24 డిగ్రీలు కనిష్టం 13 డిగ్రీలు గా వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు ఇది ఉత్తమ సమయం.