Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కుర్తాలం

కుర్తాలం టూరిజం -నీరు ప్రవహించే భూమి !

29

కుర్తాలం ప్రదేశాన్ని దక్షినాది ప్రకృతి చికిత్సాలయంగా పిలుస్తారు. ఈ పట్టణం దక్షిణ భారత దేశ తమిళ్ నాడు లోని తిరునల్వేలి జిల్లాలో కలదు. పడమటి కనుమలలో సుమారు 167మీటర్ల ఎత్తులో కల కుర్తాలం అక్కడ కల ఒక చికిత్సాలయ కారణంగానే ప్రసిద్ధి చెందినది. కుర్తాల్లం లో అనేక ఆరోగ్య కేంద్రాలు, చికిత్సాలయాలు మరియు ఔషధ గుణాల నీరు ప్రవహించే జలపాతాలు కలవు. ఇక్కడ కల అనేక జలపాతాలు మరియు నదులు ఈ ప్రదేశ అందాలను మరింత పెంచి దీనిని ఒక పర్యాటక ఆకర్షణ ప్రదేశంగా చేసాయి.

కుర్తాలం లోని మరియు చుట్టపట్ల కల పర్యాటక ప్రదేశాలు

ఈ ప్రదేశం దాని యొక్క అద్భుత అందాలకే కాక, అందమైన జలపాతాలైన పెరారువి, చిత్రారువి, షేన్ బగాదేవి ఫాల్స్, తేనరువి, ఐన్తరువి, పజతోట్ట అరువి, పజయ కోర్తల్ల అరువి మరియు పులి అరువి వంటివి కూడా ప్రసిద్ధి. ఈ టవున్ లో అనేక టెంపుల్స్ కూడా వున్నాయి. అవి కొన్ని తిరు కత్రాలనాదార్ కోవిల్ , తిరుమలై కోవిల్, కుమరన్ కోవిల్, కాసి విస్వనాతార్ కోవిల్, దక్షిణామూర్తి కోవిల్,పాపనాశం ఉలగంబిహై మరియు శివన్ కోవిల్ మరియు అరియంకావు అయాప్పాన్ కోవిల్ మొదలైనవి. చుట్టపట్ల కల ఆకర్షణలు పరిశీలిస్తే, అవి తెర కుమలై ఎస్టేట్, బోటు హౌస్, పజయ కోర్తల్ల అరువి, స్నేక్ హౌస్ మరియు పెరారువి ఆక్వేరియం మరియు పిల్లల కొరకు అనేక పార్కులు. కోర్తాలం అనే పేరు ఇంగ్లీష్ కాగా, దీనిని మొదట్లో కుట్ట్రాలం అనేవారు. ఇప్పటికి స్థానికులు కుట్ట్రాలం అనే దీనిని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని ఇంకా ముక్తివేలి, నన్నగ్రం, పితూర్ కంద, తీర్తపురం, తిరు నగరం మరియు వసంత పేరూర్ అని కూడా పిలుస్తారు. ఈ టవున్ కు సంబందిచి ఒక ప్రసిద్ధి పురాణ గాధ కలదు. శివుడు కైలాస పర్వతం పై తనకు జరిగే వివాహానికి అనేక మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చేస్తూంటే, ఆగస్త్య మహర్షిని వారిని నియంత్రించ వలసినది గా దక్షినాది దేశానికి పంపాడట. అపుడు అగస్త్యుడు, శివుడు అధికంగా వున్నా గుడులు కల కోర్తలం కు వచ్చాడు. ఇక్కడి టెంపుల్స్ కు చోళ రాజులు మరియు పాండ్య రాజులకు సంబంధించిన కొన్ని చరిత్రలు వ్రాయబడి వుంటాయి.

కుర్తాళం ఎలా చేరాలి ?

కుర్తాలం ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ధి చెందినది. దానితో ఇక్కడ అనేక ప్రపంచ శ్రేణి రిసార్ట్ లు వెలిసాయి. అయినప్పటికీ ఇక్కడకు రా గోరేవారు ముందుగా అడ్వాన్సు బుకింగ్ చేసుకోవడం మంచిది. ఈ పట్టణం అటు కేరళకు ఇటు తమిళ్ నాడుకు కూడా సమీపం కనుక రెండు రాష్ట్రాల నుండి తేలికగా చేరవచ్చు.

కుర్తాలంకు తూతుకుడి విమానాశ్రయం సమీపం. సుమారు 85 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ నుండి చెన్నై, మదురై, మరియు కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ లకు చేరవచ్చు. సమీప రైలు స్టేషన్ సేన్గోట్టాయిలో కలదు. అయెతే, తిరునల్వేలి సమీప ప్రధాన రైలు స్టేషన్. కుర్తాలంకు బస్సులో కూడా చేరవచ్చు. కేరళ, తమిళ్ నాడుల నుండి అనేక బస్సులు కలవు.

కుర్తాలం సందర్శనకు మంచి సమయం

సందర్శనకు మంచి సమయం అంటే, వర్షాకాలం మరియు శీతాకాలం .

అంటే జూలై నుండి మార్చ్ వరకు. వేసవులు అధిక వేడి, మరియు పొడి గా వుండి, ప్రధాన ఆకర్షణ అయిన జలపాతాలు ఎండి పోతాయి. వర్షాకాలం మరియు వింటర్ ఆహ్లాదకరంగా వుంటాయి. చల్లటి గాలులు, మరియు జల్లులు ఈ సమయంలో ఒక ప్రత్యేక ఆకర్షణలు.

కుర్తాలం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుర్తాలం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుర్తాలం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కుర్తాలం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం తమిల్ నాడు మరియు కేరళల నుండి కుర్తాలంకు ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    There is no railway station available in కుర్తాలం
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కుర్తాళ్ళం కు సమీప విమానాశ్రయం 85 కి. మీ. ల దూరంలోకల తూతుకుడి ఎయిర్ పోర్ట్. గంటన్నర డ్రైవింగ్ లో చేరవచ్చు. టాక్సీలు బస్సులు ఎయిర్ పోర్ట్ కు తేలికగా దొరుకుతాయి. ఎయిర్ పోర్ట్ నుండి అనేక ప్రధాన నగరాలకు, విదేశాలకు విమానాలు కలవు. ట్రైన్ ప్రయాణం కుర్తాలం కు సమీప రైలు స్టేషన్ సేన్గోట్టాయిలో కలదు. సమీపం లోని ప్రదానరైలు స్టేషన్ తిరునల్వేలి రైలు స్టేషన్. ఈ రైలు స్టేషన్ తమిళనాడు లోని అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించ బడింది. కుర్తాలం కు రైలు స్టేషన్ నుండి టాక్సీ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun