తిరునల్వేలి – పాత కొత్తను కలిసే చోటు!

తిరునల్వేలిని చాల పేర్లతో పిలుస్తారు. కాని ఇది ప్రధానంగా నెల్లై, తిన్నేవేలి అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో తిరునల్వేలిని ఆంగ్లీకరించి తిన్నెవేలి అనే పేరుతో పిలిచేవారు. స్వాంతంత్ర్య౦ తర్వాత దాని పేరును ఇది తిరిగి పొందింది. ఇక్కడ నివసించేవారు దీనిని ఎక్కువగా నెల్లై అంటుంటారు.

తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న తిరునల్వేలి జిల్లాకు ఇది ప్రధాన కేంద్ర౦. దక్కన్ పీఠభూమి దక్షిణపు అంచున ఉన్న ప్రాంతంగా దీనికి భౌగోళిక ప్రాధాన్యత కూడా ఉంది. తిరునల్వేలి, రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 613 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడు ప్రక్కన గల కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం లేదా తిరువనంతపురం నుండి 152 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దేవాలయాలు, గాలి మరలు ఉన్నభూమి – తిరునల్వేలిలోనూ, చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు

తిరునల్వేలికి పురాతనకాలానికి చెందిన అనేక దేవాలయాల సరైన వాటా ఉంది. రాష్ట్రంలోని అతి పెద్ద శివాలయం, నెల్లైఅప్పర్ ఆలయ౦ కల్గిన ప్రాంతంగా కూడా ఇది గౌరవాన్ని దక్కించుకొంది.

తిరునల్వేలి ఉన్న ప్రాంతం, దీనిని గాలిమరల ఏర్పాటు ఎంతో సాధ్యమయ్యే ప్రదేశంగా కూడా మార్చింది. ఈ విభాగంలో ప్రత్యేకత కల్గిన విద్యుత్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చాయి. ఇవి దాదాపు 3500 మెగావాట్ల విద్యుత్తును గాలి మరల ద్వారా ఉత్పత్తి చేస్తున్నాయి.

ఈ స్థల౦లోను చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాలలో కప్పల్ మాత చర్చి, శ్రీ అల్జియా మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం, శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, మేల తిరువెంకటనాథపురం ఆలయం, కీజ తిరువెంకటనాథపురం, కీజతిరుపతి వంటి ముఖ్య ప్రదేశాలు కూడా ఉన్నాయి.

తిరునల్వేలి చేరడం ఎలా

ఇది తమిళనాడులోని టుటికొరిన్ రేవు, మధురై వంటి చెప్పుకోదగిన ప్రధానకేంద్రాలతో బాటుగా ప్రక్కనే ఉన్న కన్యాకుమారి జిల్లాతో కూడా చక్కటి రోడ్డు మార్గాన్ని కల్గి ఉంది.

తిరునల్వేలి వాతావరణం

తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుండి తిరునల్వేలి వాతావరణం దాదాపుగా వేరుగా ఏం ఉండదు. వేడి, తేమ అనేవి పదాలు, అయితే వర్షాకాలం, శీతాకాలాలలో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి.

Please Wait while comments are loading...