Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరునల్వేలి » వాతావరణం

తిరునల్వేలి వాతావరణం

ఉత్తమ కాలం తిరునల్వేలి పర్యటనకు అక్టోబర్, ఫిబ్రవరి నెలల మధ్య కాలం అనువుగా ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గి కనిష్ట౦గా 26 డిగ్రీల సెల్సియస్లు, గరిష్ట౦గా 33 డిగ్రీల సెల్సియస్లు ఉంటుంటుంది. కాని, ఏడాదిలోని ఏ కాలంలో మీరు తిరునల్వేలి సందర్శించినప్పటికీ తప్పనిసరిగా కాటన్ దుస్తులు తీసుకొని వెళ్లవలసినదిగా ఎంతగానో సూచించబడింది.

వేసవి

వేసవి కాలం తిరునల్వేలిలో ఏడాది మొత్తం మీద వేసవి ఎంతో వేడిగా ఉంటుంది, ఈ కాలంలో ఉష్ణోగ్రత పెరిగి 39 డిగ్రీల సెల్సియస్ ల గరిష్ట స్థాయికి చేరుతుంది. ఉష్ణోగ్రత 34,35 డిగ్రీల సెల్సియస్ ల మధ్య ఉంటుంది, పర్యటించడానికి కాటన్ దుస్తులు తీసుకొని వెళ్ళాలని సూచించబడింది. అయినప్పటికీ, వేసవిలో తిరునల్వేలి పర్యటన అంతగా ఆచరణీయం కాదు. మార్చి, ఏప్రిల్, మే వేసవి నెలలు.

వర్షాకాలం

వర్షాకాలం తిరునల్వేలిలో వర్షాకాలం జూన్, జూలై నెలలలో ప్రారంభమౌతుంది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రత భరించగలిగే స్థాయికి చేరుతుంది. అయినప్పటికీ సందర్శకుల పర్యటనా ప్రణాలికకు అవరోధం కల్గించే ఈ కాలం తిరునల్వేలి సందర్శనకు అనువైనది కాదు.

చలికాలం

శీతాకాలం తిరునల్వేలిలో చెప్పుకోదగిన శీతాకాలమేమి ఉండదు. కాని వర్షాల తర్వాత వచ్చే నెలలలో ఉష్ణోగ్రతలు తగ్గి తిరునల్వేలి పర్యటనకు ఉత్తమ కాలంగా ఉంటుంది. ఈ సమయం అక్టోబర్ నుండి మార్చి నెల వరకు ఉంటుంది.