దిండిగల్ - సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫోర్ట్

తమిళ్ నాడు రాష్ట్రం లో ఉన్న నగరం ఈ దిండిగల్. దిండిగల్ అంటే 'తిండు' అంటే పిల్లో లేదా దిండు, 'కల్' అంటే రాయి. నగరం కి దగ్గరలో ని ఉన్న కొండలను అది సూచిస్తుంది. పాలని కొండలు , సిరుమలై కొండల మధ్యలో ఉన్న ఈ నగరం సారవంతమైన భూమి తో వ్యవసాయానికి అనువుగా ఉంటుంది. ఈ ప్రదేశం అనేక జిల్లాలతో నగరాల మధ్యలో ఉన్నది. ఉత్తరాన కారి, ఎరోడ్ జిల్లాలతో, దక్షిణాన మదురై, పడమర తిరుప్పూర్, కేరళ ఉన్నాయి. అంతే కాక, దిండిగల్ బిర్యానీ సిటీ, సిటీ అఫ్ లాక్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ టానరీ వంటి పేర్లతో కూడా పిలువబడుతుంది.

పర్యాటక ప్రదేశాలు ఇక్కడున్నటువంటి అధ్బుతమైన కోట మాత్రమే కాకుండా కొన్ని దేవాలయాలు, పవిత్ర నదులు ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా మారుస్తున్నాయి. 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఎన్ పంజంపట్టి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. 300 సంవత్సరాల వయసు గల రోమన్ కాథలిక్ చర్చ్ ఒక ముఖ్య ఆకర్షణ.

అంతేకాక, క్రీస్ట్ ది కింగ్ చర్చ్ మరియు సెయింట్ జోసెఫ్ చర్చ్ ఇక్కడి ముఖ్య చర్చ్ లు. దిండిగల్ కి దగ్గరలోని సిరుమలై హిల్ రిసార్ట్ ఒక ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్. బెగంబుర్ బిగ్ మాస్క్, శ్రీ కొట్టి మరింమన్ కోవిల్, కాశి విశ్వనాథన్ టెంపుల్, కామాక్షి అమ్మన్ దేవదానపట్టి, తాడి కొంబు పేరుమల్ టెంపుల్, అబిరామి అమ్మన్ టెంపుల్, ఆంజనేయర్ టెంపుల్, అతూర్ కామరాజర్ లేక్ మరియు కమరాజార్ సాగర్ దమరె వంటివి సందర్శించదగినవి.

వైగై, మరుడా మరియు మంజలరు నదుల సంగమ స్థలాల్లో ఉన్న ప్రదేశం ఒక పవిత్ర పర్యాటక ప్రదేశం. మాల కొట్టై చిన్న కొండల వద్దకు ట్రెక్కింగ్ చెయ్యవచ్చు.

చిన్నలపట్టి ఇక్కడున్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడి వంటలు కూడా దక్షిణ భారత దేశాన ప్రఖ్యాతి చెందాయి. దిండిగల్ బిర్యానీ కి ప్రఖ్యాతి. అందుకే బిర్యానీ సిటీ అని పిలువబడుతుంది. అంతే కాక, ఇక్కడ ఇతర వంటకాలు కూడా ప్రసిద్ది. పర్యటనలో ఇక్కడి వంటకాలను రుచి చూడవలసిందే.

నగర చరిత్ర ఇక్కడున్నటువంటి అతి ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కొండల పైన ఉన్న రాక్ ఫోర్ట్. ముత్తు కృష్ణ నాయకర్, మదురై రాజు, 1605 లో నిర్మాణం మొదలుపెట్టి 1623 నుండి 1659 వరకు పూర్తయింది. 1755 లో హైదర్ అలీ, అతని భార్య, అతని కుమారుడు అయిన టిప్పు సుల్తాన్ తో దిండిగల్ కి వచ్చాడు. 1784 నుండి 1790 వరకు టిప్పు సుల్తాన్ ఈ కోటను పాలించాడు. 1784 లో టిప్పు సుల్తాన్ యొక్క సేనాధిపతి ఈ కోటకి అనేక కొత్త గదులు తో పాటు బలమైన గోడలతో పునర్నిర్మించారు. 1790 లో బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ ని మైసూర్ యుద్ధం లో ఓడించాక ఇది వారి అధీనం లో కి వచ్చింది.

దిండిగల్ కి ఎలా చేరుకోవాలి ?దిండిగల్ కి చేరుకోవడం చాలా సులభం. అనేక మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మదురై ఎయిర్పోర్ట్ దిండిగల్ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం. దిండిగల్ రైల్వే స్టేషన్ అన్ని ప్రముఖ నగరాల కు కలపబడి ఉన్నది. స్థానిక ప్రయాణానికి ఆటో రిక్షాలు, టాక్సీ లు అందుబాటులో ఉంటాయి.

వాతావరణం ఎండాకాలం లో వేడిగా, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. అందుకే వర్షాకాలం లో మరియు చలి కలం లో పర్యటనకు ఉత్తమం. అప్పుడు, వాతావరణం ఆహ్లాదంగా ఉంది పర్యటనకు అనువుగా ఉంటుంది. అందువల్ల, సెప్టెంబర్ నుండి మార్చ్ వరకు అనువుగా ఉంటుంది.

Please Wait while comments are loading...