తిరుపూర్ - దేవాలయాలు మరియు వస్త్రాలకు ప్రసిద్ది చెందిన ప్రదేశం

దక్షిణ భారతదేశంలోని చాలా మంది ప్రజలలో తిరుపూర్ వస్త్ర సెంటర్ పేరును తెలియని వారంటూ ఎవరు ఉండరు. తమిళనాడులోని కోయంబత్తూర్ నగరం నుండి తిరుపూర్ 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసే వస్త్రాలను దేశవ్యాప్తంగా మార్కెట్లలో విక్రయిస్తారు.

అనేక ప్రముఖ దుస్తుల తయారికి తిరుపూర్ లో కర్మాగారాలు ఉన్నాయి. ఇప్పటికి అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇది తిరుప్పూరు జిల్లా పరిపాలనా కేంద్రం మరియు నోయ్యాల్ నది ఒడ్డున ఉంది. ఇది తమిళనాడులోని కొంగునాడులో భాగంగా ఉన్నది.

తిరుపూర్ నూలు కర్మాగారాలలో పనిచేయటానికి శ్రామిక వర్గ వలసదారులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వలస వెళ్లారు.తిరుపూర్ జనాభా మరియు ప్రాంతం పరంగా చేస్తే తమిళనాడులో 7 వ అతిపెద్ద నగరం.

తిరుపూర్ చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

తిరుపూర్ నగరంలో అనేక నూలు కర్మాగారాలలో పాటు, చోళ, పాండ్య కాలానికి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అవినాశి వద్ద అరుళ్మిగు అవినాశి లింగేస్వరార్ తిరుకోయిల్, తిరుపూర్ తిరుపతి ఆలయం మరియు సుక్రీస్వరార్ ఆలయం వంటి ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. తిరుపూర్ నగరం చుట్టూ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి.

ఈ నగరం నడిబొడ్డున ఉన్న విశ్వేశ్వరస్వామి ఆలయం యొక్క చరిత్ర ఉనికిలో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం లోపల శివలింగంను పూజిస్తారు. కాశి తీర్ధయాత్ర నుండి ఒక రాజు తనతో పెట్టుకొని తీసుకువచ్చెను.

తిరుపూర్ నగరంనకు విప్లవంతో భాగస్వామ్యం కలిగి ఉన్నది. తమిళనాడులో జరిగిన స్వాతంత్ర్య పోరాట రోజులలో రాజకీయంగా అనిశ్చిత మచ్చలు మరియు నగరం నడిబొడ్డున గొప్ప దేశభక్తుడైన తిరుప్పూరు కుమరన్ స్మారక విగ్రహం కలిగి ఉంది. దేశంలోని గొప్ప దేశభక్తులు పెరియార్,E. V. రామస్వామి మరియు C.N. అన్నాదురై లకు సమావేశ ప్రదేశంగా పనిచేసింది.

ఇక్కడ అందిపలయం సరస్సు మరియు శివన్మలై లను కూడా సందర్శకులు అభిమానిస్తారు. తిరుపూర్ సముద్ర మట్టం 967 అడుగుల ఎత్తులో ఉన్న ఒక క్లిష్టమైన జంక్షన్, మరియు తమిళనాడులో వాణిజ్య ప్రాముఖ్యతను కలిగిన సేలం,కోయంబత్తూర్ వంటి అనేక నగరాల వల్ల వృద్ధిచెందుతుంది. నగరం నుండి పూర్తి ఉత్పత్తుల రవాణా మరియు వస్త్ర పరిశ్రమ అవసరం అయ్యే ముడి పదార్థాల రవాణా సులభంగా ఉంటుంది.

ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా ఉండటం వల్ల దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వలస కార్మికులను ఆకర్షిస్తుంది మరియు మిశ్రమ జనాభాను కలిగి ఉంది. తిరుపూర్ స్థానిక జనాభాలో హిందువులు (గౌండర్ కులం చెందింది), ముస్లింలు మరియు క్రైస్తవులు ఉన్నారు. తిరుపూర్ వేగవంతమైన పారిశ్రామికీకరణ సానుకూలంగా ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయటంలో మాత్రం విజయం సాధించింది.

తిరుపూర్ వాతావరణం

తిరుపూర్ ఒక అందమైన స్థిరంగా ఉండే వాతావరణం. ఈ వాతావరణం తమిళనాడు అంతర్గత భాగంలో చాలా అరుదుగా కనిపిస్తుంది మరియు అందువలన సంవత్సరంలో అన్ని కాలాలలో తిరుపూర్ సందర్శించడానికి అనువుగా ఉంటుంది.

తిరుపూర్ ఎలా వెళ్ళాలి?

తిరుపూర్ ను విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. తిరుపూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. నగరం కూడా వస్త్ర ఉత్పత్తి కోసం ఒక ప్రధాన కేంద్రంగా, రహదారులు ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడింది. తిరుపూర్ దేశంలో ప్రతి ముఖ్య నగరం వెళ్లే రైళ్లు కోసం సొంత రైల్వే స్టేషన్ ఉంది.

Please Wait while comments are loading...