Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఎర్కాడ్

ఎర్కాడ్ – అందమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం!

15

ఎర్కాడ్ తమిళనాడు లోని తూర్పు కనుమలలోని శేవరోయ్ కొండలలో ఉన్న ఒక పర్వత కేంద్రం. మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంత౦ అందమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్గి అనేక మంది పర్యాటకులను రప్పిస్తుంది. కొన్నిసార్లు ఎర్కాడ్ ను ‘పేదవాని ఊతకమండ్’ గా పేర్కొన్నప్పటికీ ఊటీ వంటి ఇతర పర్వత కేంద్రాలతో పోల్చి చూసినప్పుడు ఇక్కడి పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉంటాయి.

ఎర్కాడ్ స్థానికులు, విదేశీ పర్యాటకులలో వేగంగా ప్రాచుర్యం పొందుతుంది. ఎర్కాడ్ అనే పేరు రెండు తమిళ పదాలు – ‘ఏరి’ ( సరస్సు), ‘కడు’ ( అడవి ) నుండి ఏర్పడింది. ఎర్కాడ్ ప్రధానంగా కాఫీ, నారింజ, పనస, జామ, యాలుకలు, మిరియాలు వంటి తోటలకు ప్రసిద్ధి చెందింది. స్కాట్లండు కు చెందిన కలెక్టర్ శ్రీ ఎం.డి. కాక్ బర్న్ 1820 లో ఆఫ్రికా నుండి ప్రధాన కాఫీ ఉత్పత్తిని తీసుకొని వచ్చాడు. ఇక్కడ దుర్వినియోగం కాని స్థితిలో ఉన్న చక్కటి వృక్షాలు, వన్యప్రాణి కల్గిన ఒక అభయారణ్యం కూడా ఉంది. ఎర్కాడ్ అడవులలలో చందనం, టేకు, సిల్వర్ వోక్ చెట్లు సమృద్ధిగా ఉన్నాయి. అడవిదున్న, లేడి, నక్కలు, ముంగీసలు, పాములు, ఉడతలు వంటి వన్య జంతువులతో బాటుగా బుల్ బుల్ పిట్టలు, గద్దలు, పిచ్చుకలు, స్వాలోలు వంటి పక్షులను కూడా ఈ అడవులలో చూడవచ్చు. ఎర్కాడ్ పర్వత కేంద్ర మైనప్పటికి తీవ్ర మైన వాతావరణం పరిస్థితులు లేనందున పర్యాటకులకు శీతాకాలపు భారీ ఉన్ని దుస్తులు మోసి తీసుకొని వచ్చే కష్టం లేకుండా తమ దుస్తులు తెచ్చుకోవడానికి సులువుగా ఉంటుంది.

ప్రాంతాల సందర్సనతో బాటుగా పర్యాటకులు ఎర్కాడ్ చుట్టూ పర్వతారోహణ ను కూడా ఎంపిక చేసుకొనవచ్చు. ఒక వేళ మే నెలల్లో ఇక్కడకు వచ్చినట్లయితే, ఉత్సవాలు, బోటు పందాలు, పుష్పాల ప్రదర్శన, కుక్కల ప్రదర్శన ఉండే వేసవి ఉత్సవాలను తప్పక చూడాలి. చరిత్ర అంటే ఆసక్తి ఉన్నవారికి ఎర్కాడ్ లో కొన్ని చారిత్రిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎర్కాడ్ పురాతన చరిత్ర పెద్దగా తెలియనప్పటికీ, తెలుగు రాజుల కాలంలో ఎర్కాడ్ లో మొదటగా జనజీవనం ఏర్పడిందని విశ్వసిస్తారు. బ్రిటీష్ పాలనా కాలంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ థామస్ మూరీ 1842 లో ఎర్కాడ్ ను కనుగొన్నాడు. ఎర్కాడ్ షాపింగ్ కు ప్రత్యేక గమ్యస్థానం కానప్పటికీ, ఇక్కడ పర్యాటకులకు అందించేందుకు కొన్ని వస్తువులు ఉన్నాయి. సహజమైన నూనెలు, సుగంధ ద్రవ్యాలు, చర్మ సంరక్షణా ఉత్పత్తులు, స్థానిక ఉత్పత్తి మిరియాల తాజా పాకెట్లు, యాలుకలు, కాఫీ ఇటువంటి కొన్ని వస్తువులు. ఎర్కాడ్ లో వసతి సౌకర్యం పొందటం సులువు. బడ్జెట్ హోటళ్ళు, విలాసవంతమైన విడిది గృహాలు, ఇళ్ళలో బసల వంటి ఐచ్చికాల అనేక నుండి ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.

ఎర్కాడ్ లోని పర్యాటక ప్రాంతాలు

విస్తారమైన సుందర లోయలు, అందమైన భూభాగాలతో ఎర్కాడ్ పర్యాటకుల కోసం అనేక ఆకర్షణలను పొందుపరచుకొని ఉంది. దేవాలయాలు, గుహల నుండి జలపాతాల వరకు, పర్వత౦ పై నుండి లోయ అద్భుతమైన దృశ్యాల వంటి వాటితో ప్రజల ముఖాలపై చిరునవ్వును తెప్పించేది ఎర్కాడ్ లో ఏదో ఉంది. ఎర్కాద్ సముద్ర మట్టానికి 4700అడుగుల ఎగువన ఉండటం ఒక ప్రముఖ ఆకర్షణ. ధార్మిక పాఠశాలలు, మఠాలు ఉన్న ఎర్కాడ్ సాయంత్రపు నడకకు కూడా అనువైనది. సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్, మోంట్ ఫోర్ట్ స్కూల్ అందంగా నిర్మించి, నిర్వహిస్తున్న ఎర్కాడ్ లోని రెండు ఎంతో ప్రసిద్ధ ఆకర్షణలు. మరొక ప్రముఖ ఆకర్షణ ఎర్కాడ్ కొండలపై లేడీస్ సీట్, జెంట్స్ సీట్, చిల్డ్రన్ సీట్ అని ప్రధానంగా పిలిచే ఒక సహజ రాళ్ల సముదాయం. ఇవి కూర్చోనే స్థలాల్లా ఉండి ఘాట్ రోడ్డు, మెట్టూర్ డాం, సేలం కనబడే విధంగా ఎదురుగా ఉంటాయి. కథనాల ప్రకారం ఈ ప్రాంతం నుండి కనబడే అందమైన దృశ్యాలను మెచ్చుకొంటూ ఒక ఇంగ్లీష్ స్త్రీ అస్తమించే సూర్యుని ఎండలో చలి కాచుకొనేది. అందువల్లే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ దృశ్యాలను చూసే టెలిస్కోప్ ఉన్న బురుజు ఒకటి పగటి వేళలలో సందర్శనకు తెరిచి ఉంటుంది. పెద్ద సరస్సు, ఎలుగుబంటి గుహ, లేడీస్ సీట్, జెంట్స్ సీట్, చిల్డ్రన్ సీట్, ఆర్థర్ సీట్, అన్నా పార్క్, వృక్ష శాస్త్ర ఉద్యానవనం, మోంట్ ఫోర్ట్ పాఠశాల, సర్వరాయ ఆలయం, శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం, టిప్పరరి దృశ్యాల స్థలం ఎర్కాడ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన కొన్ని ఆకర్షణలు.

ఎర్కాడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఎర్కాడ్ వాతావరణం

ఎర్కాడ్
30oC / 87oF
 • Patchy rain possible
 • Wind: SW 9 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఎర్కాడ్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ఎర్కాడ్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం ద్వారా ఎర్కాడ్ తమిళనాడు, ప్రక్క రాష్ట్రాల అన్ని ప్రధాన నగరాలతో చాల వరకు రోడ్డు మార్గాన్ని కల్గి ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు లతో బాటుగా ప్రైవేట్ బస్సు కూడా ప్రతి రోజు సేలం నుండి ఎర్కాడ్ కు ఉంది. కోయంబత్తూరు (190), చెన్నై(356), బెంగుళూరు(230) నుండి కూడా ఈ పట్టణానికి బస్సులు ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం ద్వారా ఎర్కాడ్ నుండి 35 కిలోమీటర్ల దూరంలోని సేలం అతి దగ్గరి రైలు స్టేషన్. దేశంలోని దక్షిణ ప్రాంతంలో తిరిగే రైళ్ళు కొచ్చిన్, ఈరోడ్, మంగళూర్ త్రివేండ్రం తో మార్గాన్ని కలిగిన సేలం గుండా నడుస్తాయి. జోలర్పట్టి, ఎకాడ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉన్న మరొక రైలుస్టేషన్.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా ఎర్కాడ్ కు అతి దగ్గరగా త్రిచి లేదా తిరిచరాపల్లి 163 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోయంబత్తూరు, బెంగుళూరు దగ్గరగా ఉన్న ఇతర విమానాశ్రయాలు. త్రిచి నుండి ఎర్కాడ్ కు టాక్సీలు విరివిగా మంచిది.
  మార్గాలను శోధించండి

ఎర్కాడ్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Oct,Tue
Return On
23 Oct,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Oct,Tue
Check Out
23 Oct,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Oct,Tue
Return On
23 Oct,Wed
 • Today
  Yercaud
  30 OC
  87 OF
  UV Index: 7
  Patchy rain possible
 • Tomorrow
  Yercaud
  27 OC
  80 OF
  UV Index: 7
  Moderate or heavy rain shower
 • Day After
  Yercaud
  24 OC
  76 OF
  UV Index: 7
  Moderate or heavy rain shower