తిరువెంకడు - బుదగ్రహం యొక్క నవగ్రహ ఆలయం

తిరువెంకడు నాగపట్నం జిల్లాలో ఉంది.ఈ ప్రదేశం సిర్కాలి,పూంపుహార్ రహదారి ఆగ్నేయం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రదేశంలో లార్డ్ ఇంద్రుడు యొక్క తెల్ల ఏనుగు(ఐరావతం) ధ్యానం చేయుట వల్ల ఆ పేరు వచ్చినదని చెప్పుతారు. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి.

తిరువెంకడు కాశీ పోలిన ఆరు దివ్య ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఈ స్థానంలో, విగ్రహం మరియు దైవ చెట్టు ,పవిత్ర నీరు ప్రతి ఒక్కటిలో3 వ స్థానంలో ఉంది.తిరువెంకడు తొమ్మిది గ్రహాలలోని బుధ గ్రహంనకు చెందినది. ఈ ప్రదేశం యాభై శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్నది .శివుడి యొక్క 64 ముద్రలు ఉన్నాయి.ఇక్కడ శివుడి ఉగ్రమూర్తి రూపం చూడవచ్చు. ఇది శివుడి ఆరు వేర్వేరు తాండవం లేదా నృత్య రూపాలను ప్రదర్శించిన ప్రదేశం. ఇది చిదంబరం వలె ప్రఖ్యాతి గాంచింది .

తిరువెంకడు చరిత్ర

మురుతువన్ అనే రాక్షసుడు లార్డ్ బ్రహ్మ నుండి వరములు పొంది దేవతలను చిత్రహింసలకు గురి చేసేను. దేవతలు రాక్షసుడు నుండి కాపాడమని శివుని ప్రార్ధించారు. అప్పుడు శివుడు దేవతలను తిరువెంకడు వెళ్లి అక్కడ నివాసం ఉండమని చెప్పెను. ఆ తర్వాత శివుడు తన వాహనమైన నందిని పోరాడటానికి పంపెను. నంది రాక్షసుడుని జయించి మరియు సముద్ర లోకి విసిరెను.ఆ తర్వాత, రాక్షసుడు తీవ్రమైన తపస్సు ద్వారా శివుడు నుండి శూలాన్ని పొందెను. శూలాన్ని పొందిన తరవాత రాక్షసుడు అమాయక ప్రజల మీద దాడి చేయడానికి అత్యదిక సామర్థ్యంతో తిరిగి వచ్చాడు.మళ్లీ, దేవతలు వారిని రక్షించేలా శివుడిని అభ్యర్థించిన, మరొక సారి నందిని శివుడు పంపెను.

రాక్షసుడి దగ్గర ఉన్నశూలం ద్వారా నంది తీవ్రంగా గాయపడేను. వెనుక భాగంలో గాయాలతో ఉన్న నంది విగ్రహాన్ని ఇప్పుటికీ చూడవచ్చు. నందికి తగిలిన గాయంను చూసి ఆగ్రహించిన శివుడు తన 3 వ కన్ను తెరవటం వలన రాక్షసుడు మరణించెను. విగ్రహంలో శివుని యొక్క ఉగ్రమూర్తి రూపంను చూడవచ్చు. ఇక్కడ ఉగ్ర రూపంలో ఉన్న శివున్ని పూజిస్తారు.

తిరువెంకడు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

మొత్తం 8 నవగ్రహ స్థలాలు దగ్గరగా తిరునగేస్వరంలో (ఇది తొమ్మిది నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలు మధ్య ఒకటి) ఉన్నాయి. తిరునల్లార్ (శని లేదా శని కోసం), కన్జనూర్ (వీనస్ లేదా లార్డ్ శుక్ర కోసం), సూర్యనార్ కోయిల్ (సూర్యుడు లేదా లార్డ్ సూర్య), తిరునగేస్వరం (లార్డ్ రాహు), తిన్గాలుర్ (చంద్రుడు లేదా లార్డ్ చంద్రన్ కోసం), కీజ్హ్పెరుమ్పల్లం (లార్డ్ కేతు ) తిరువెంకడు చేరువలో ఉన్నాయి.

తిరువెంకడులో వాతావరణము

తిరువెంకడులో వాతావరణము వేడిగా ఉంటుంది. తిరువెంకడును సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఉన్నది.

తిరువెంకడుకు ఎలా వెళ్ళాలి?

తిరువెంకడును సులభంగా విమాన,రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా తన్జవార్,త్రిచి, మధురై, చెన్నై, కన్యాకుమారి, తిరువంతపురం మొదలగు వాటి నుండి అనుసంధానించబడి ఉంది.

Please Wait while comments are loading...