Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరునగేశ్వరం

తిరునగేశ్వరం – రాహువు నవగ్రహ ఆలయం !

7

తిరునగేశ్వరం, తమిళనాడు లోని తంజావూర్లో ఉన్న ఒక పంచాయతి పట్టణం. ఇది కుంబకోణం నగరానికి తూర్పు వైపుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని రాహుదేవునికి (రాహువు గ్రహం) అంకితమిచ్చారు. తిరునగేశ్వరం సారవంతమైన భూమికి కూడా పేరొందింది, ఇక్కడ పండించే పంటలలో గోధుమలు, వరి, మొక్కజొన్న ప్రధానమైనవి. ఇక్కడ విస్తారమైన మామిడి, కొబ్బరి తోటలను కూడా మనం గమనించవచ్చు.

తిరునగేశ్వరం లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు ఈ పట్టణంలో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి- ఒకటి శైవుల ప్రముఖ ఆలయం “నాగనాథ స్వామి” కాగా, రెండవది వైష్ణవుల ప్రసిద్ధ “ఒప్పిలియప్పన్ ఆలయం”. నాగనాథ స్వామి ఆలయంలో ప్రధాన దేవత శివుడు తన సహచరి పార్వతి దేవితో దర్శనమిస్తాడు. రాహువు విగ్రహం ఈ ఆలయంలో మానవ రూపంలో దర్శనమిస్తుంది. ఎవరి జన్మపట్టికలోనైన రాహు గ్రహం దుష్ప్రభావాలు వారి జీవితంలో ఇబ్బందులను కల్గ చేస్తాయని అంటారు. అందువల్ల, నాగనాథ స్వామి ఆలయంలో రాహువును పూజిస్తే ఇటువంటి దురదృష్టాల నుండి బయట పడవచ్చు. ఈ ఆలయంలోని ప్రధాన అంశం రాహువుకు చేసే క్షీరాభిషేకం.

ఏడాది పొడవునా తీర్థయాత్రికులు సందర్శించే ఒప్పిలియప్పన్ ఆలయం కూడా తిరునగేశ్వరంలో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో, రామనవమిని అద్భుతంగా జరుపుకుంటారు. రామనవమి చివరి రోజు, కనకాభిషేకం, తిరుకల్యాణం గొప్పగా, భారీ ఎత్తున జరుగుతాయి, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ రెండు ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తారు. తిరునగేశ్వరం చుట్టుపక్కల ఉన్న నవగ్రహ ఆలయాలు

8 నవగ్రహ స్థలాలు అన్ని తిరునగేశ్వరానికి దగ్గరగా ఉన్నాయి (ఇది తొమ్మిది నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలలో ఒకటి). తిరునల్లార్ (శనిగ్రహం), కంజనూర్ ( శుక్రగ్రహం), సూర్యనార్ కోయిల్ (సూర్యుడు), తిరువెంకడు ( బుధుడు), తింగలూర్ (చంద్రుడు), కీజ్పెరు౦పల్లం ( కేతువు), అలంగుడి (గురగ్రహా౦), వైదీశ్వర కోయిల్ (అంగారకుడు) తిరునగేశ్వరానికి దగ్గరగా ఉన్నాయి. సులువుగా చేరేమార్గం తిరునగేశ్వరానికి కుంబకోణం రైలు స్టేషన్ అతి దగ్గరగా ఉంది. ఈ ప్రాంతానికి త్రిచి విమానాశ్రయం బాగా దగ్గర. బస్సు సేవలు కూడా చాలా చక్కగా ఉండటం వల్ల పర్యాటకులు కుంబకోణం నుండి తిరునగేశ్వరం బస్సుల ద్వారా చేరవచ్చు.

తిరునగేశ్వరం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరునగేశ్వరం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరునగేశ్వరం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరునగేశ్వరం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు తంజావూరు, తిరునగేశ్వరం తో బాటుగా అన్ని నవగ్రహ స్థలాలకు తమిళనాడులోని అన్ని ఇతర ప్రధాన పట్టణాలను కలుపుతుంటాయి. పర్యాటకులు మధురై, త్రిచిల నుండి త్రినగేశ్వరంకు రోజువారి బస్సు సౌకర్యాన్ని పొందవచ్చు. పర్యాటకులకు కన్యాకుమారి, చెన్నై, త్రివేండ్రం, బెంగుళూరు, మదురై వంటి ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా వాయు మార్గాల వలె రైలు మార్గాలు కూడా చక్కగా ఉన్నాయి. అతి దగ్గరగా త్రిచి జంక్షన్ ఉంది, ఇక్కడ నుండి సందర్శకులకు చెన్నై, మదురై లకు రైళ్ళు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా తిరునగేశ్వరం, తంజావూర్ జిల్లాలో ఉంది. తంజావూర్ జిల్లాకు కేవలం 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిచి విమానాశ్రయం ఈ పట్టణానికి అతి దగ్గరది. బెంగుళూరు, చెన్నై విమానాశ్రయాలు కూడా ఈ పట్టణానికి దగ్గరగా ఉన్నాయి. త్రిచి నుండి చెన్నై కు నిరంతరం విమానాలు ఉన్నాయి. పైగా ఈ విమానాశ్రయాల నుండి భారత దేశంలోని ఇతర ముఖ్య పట్టణాలు, దూరతీరప్రాంతాలకు చక్కటి మార్గం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jun,Sun
Check Out
22 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon