Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వేలన్ కన్ని

వేలన్ కన్ని - దివ్యత్వం ఆవరించిన ప్రదేశం !

12

తమిల్ నాడు కోరమండల్ కోస్తా తీరంలో కల వేలన్ కన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడకు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాలనుండి వస్తారు. నాగపట్టినం జిల్లలో కల వేలన్ కన్నిలో వర్జిన్ మేరీ గుడి కలదు. ఈ పుణ్య క్షేత్రం మడోన్నా వేలన్ కన్నికి అన్కితమివ్వబడినది. ఈ దేవత నే 'అవర్ లేడీ ఆఫ్ హెల్త్' అని కూడా అంటారు. చెన్నై నుండి వేలన్ కన్ని సుమారు 325 కి.మీ.ల దూరంలో దక్షిణ దిశగా వుండి తేలికగా చేరేది గానే వుంటుంది.

అద్భుతాలు జరిగిన భూమి !

వర్జిన్ మేరీ, వేలన్ కన్నిలో 1560లో సాత్కాతరించినదని ఈ టవున్ లో ఈ కాలానికి ముందే ఆధ్యాత్మక చింతన అధికంగా ఉండేదని చెపుతారు. ప్రసిద్ధ నమ్మకాల మేరకు, మేరీ ఒక గొర్రెల కాపరిని తన బిడ్డ అయిన జీసస్ దాహం తీర్చటానికి గాను పాలు కోరింది.ఈ సంఘటన చూపుతూ అందుకు గుర్తుగా ఇక్కడ ఒక చాపెల్ నిర్మించారు. వేలన్ కన్ని ని 'అద్భుతాల భూమి ' అని అంటారు. ఇక్కడ అనేక అద్భుతాలు జరిగినట్లు పట్టణంలో చెప్పుకుంటారు. వాటిలో ఒకటి చెప్పాలంటే, 17 వ శతాబ్దంలో ఒక పోర్చుగీస్ వాణిజ్య ఓడ బంగాళా ఖాతంలోని పెను తుఫానుకు గురైంది. నిరాశలో కల ఆ ఓడ నావికులు వారు సురక్షిత ప్రదేశానికి ఎక్కడకు చేరితే అక్కడ ఒక చాపెల్ నిర్మిస్తామని వర్జిన్ మేరీ కి వాగ్దానం చేసారు. ఆ ఓడ ఈ ప్రదేశానికి చేరింది. వాగ్దానం చేసిన నావికులు అక్కడే కల మేరీ చాపెల్ ను మరో మారు పునర్మించారు. ఇతిహాసం మేరకు ఈ ఓడ సరిగ్గా మేరీ జన్మదినం సెప్టెంబర్ 8 వ తేదీన అక్కడకు చేరింది. అయిదు వందల సంవత్సరాల నుండి ఈ అద్భుతాన్ని ఒక వేడుకగా లక్షలాది భక్తులు ఇక్కడకు వచ్చి అతి వైభవంగా జరుపుతారు. ఈ యొక్క 'అవర్ లేడీ ' చాపెల్ దేశం లోనే ప్రసిద్ధి చెందినా క్రైస్తవ క్షేత్రాలలో ఒకటిగా నిలచింది. మరో అద్భుతం చెప్పాలంటే, ఒక హిందూ పాల మనిషి, మేరీ కి తన గిన్నె నుండి కొన్ని పాలు పోసి మరల ఆ గిన్నె లోని పాలను ఒక ఖాతాదారు కు పూర్తిగా పోయటం జరిగింది. మరొక అద్భుతం అంటే, ఒక కుంటి బాలుడు మేరీ కి మజ్జిగను అందించి తన కుంటితనాన్ని పోగొట్టుకున్నాడు.

విచారకర సంఘటన ఇక్కడ ఏమంటే, ఇక్కడి సముద్రంలో సంభవించిన పెను తుఫాను కారణంగా అతి సుందరమైన ఈ టవున్ 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన చెప్పలేనంతగా దెబ్బ తిన్నది. సముద్రంలో వచ్చిన భూకంపం వేలన్ కన్ని పట్టణాన్ని ధ్వసం చేసింది. ఈ సంక్షోభంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే ఇది ఒక అతి పెద్ద విషాదంగా మిగిలిపోయింది. ఈ పెను తుఫాను విధ్వసం తరవాత చేపట్ట బడిన పునరావాస కార్యక్రమాలు ఊహించని రీతిలో వేగంగా సాగి మరోమారు వేలన్కన్ని పట్టణం పునరుజ్జీవం పొందింది. ఇపుడు ఈ పట్టణంలో సునామి పెను తుఫానుకు నిదర్శనాలు అంటే అవి వీడియోలలో మాత్రమే చూడగలము.

వేలన్ కన్ని లో చూసేందుకు అనేక ఆకర్షణలు కలవు. వేలన్ కన్ని బాసిలిక, మ్యూజియం ఆఫ్ ఆఫరింగ్ , శ్రిన్ డిపో, వేలన్ కన్ని బీచ్ మొదలైనవి. అద్భుత ఫౌంటెన్, హోలీ పాత్, మరియు లేడీ ట్యాంక్ చర్చి వంటివి కొన్ని టూరిస్ట్ ఆకర్షణలు. ఈ టవున్ లో అనేక ఆధునిక సౌకర్యాలు అంటే ఏ టి ఎం లు , హోటళ్లు , హోం స్టే లు, మరియు ఒక రైల్వే స్టేషన్ కలవు. గుడి డిపో లో మీకు హస్త కళల వస్తువులు, ఇతర మతపర వస్తువులు దొరుకుతాయి. ఇదే భవనంలో ఒక సమాచార కౌంటర్ కలదు. ఇక్కడ మీరు టవున్ గురించిన సమాచారం పొందవచ్చు.

వేలన్ కన్ని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వేలన్ కన్ని వాతావరణం

వేలన్ కన్ని
30oC / 87oF
  • Patchy rain possible
  • Wind: SW 9 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం వేలన్ కన్ని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వేలన్ కన్ని

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం వేలన్ కన్నికి తమిళ్ నాడు , కర్ణాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ ల లోని ప్రధాన ప్రదేశాల నుండి బస్సు లు కలవు. మదురై, తీరిచి, తిరువనంతపురం మరియు తంజావూర్ ల నుండి కూడా తరచుగా బస్సు లు దొరుకుతాయి. డీలక్స్ బస్సులు ప్రధాన నగరాల నుండి వేలన్ కన్నికి కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం వేలన్ కన్నికి స్వంత రైలు స్టేషన్ కలదు. అయితే రైళ్ళు తక్కువ. వేలన్ కన్నికి నాగ పట్టినం రైలు స్టేషన్ 12 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇక్కడ నుండి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. నాగ పట్టినం నుండి వేలన్ కన్నికి టాక్సీ చార్జీలు సుమారు రూ.250గా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం వేలన్ కన్ని కి సమీప ఎయిర్ పోర్ట్ త్రిచి లో కలదు. ఇది సుమారు 153 కి.మీ.ల దూరంలో వుంటుంది. సమీప అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ చెన్నై లో కలదు. చెన్నై నుండి త్రిచి కి అనేక ఫ్లైట్ లు కలవు. త్రిచి నుండి వేలన్ కన్ని కి టాక్సీ చార్జీలు రూ.2,000 గా వుంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Oct,Wed
Return On
24 Oct,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Oct,Wed
Check Out
24 Oct,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Oct,Wed
Return On
24 Oct,Thu
  • Today
    Velankanni
    30 OC
    87 OF
    UV Index: 7
    Patchy rain possible
  • Tomorrow
    Velankanni
    27 OC
    80 OF
    UV Index: 7
    Moderate or heavy rain shower
  • Day After
    Velankanni
    24 OC
    76 OF
    UV Index: 7
    Moderate or heavy rain shower