Search
  • Follow NativePlanet
Share

నాగూరు - ఒక పుణ్యక్షేత్ర గమ్యస్థానం!

11

నాగూరు తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉన్న ఒక నగరం. ఈ నగరం బంగాళాఖాతంనకు దగ్గరలో ఉన్నది. దీనికి ఉత్తరంగా 4 కిమీ దూరంలో నాగపట్నం ఉన్నది. దక్షిణాన 16 కిమీ దూరంలో కారైకాల్ ఉన్నది. ఈ ప్రదేశంను చైనీస్ పర్యాటకుడు హిఉఎన్ త్సాంగ్ రాసిన పుస్తకంలో బుద్ధ విహార్ గా పేర్కొనెను. నాగూరును 690-728 AD లో పల్లవ రాజు రాజసింహ పాలించెను.

నాగూరు మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

నగరం యొక్క ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధి చెందిన నాగూరు దర్గా ఉంది. ఈ దర్గా కారణంగా నాగూరు ఒక పుణ్యక్షేత్ర గమ్యస్థానంగా గుర్తించబడింది. ఈ ఇస్లామిక్ ఆలయం మీరన్ సాహిబ్ అబ్దుల్ కదిర్ శాహుల్ హమీద్ బాద్షా కు అంకితం చేయబడింది. నాగూరులో ఎజ్హు లేబ్బై జామియా మసీదు,ఫాతిమా జామియా మసీదు మరియు తీరు పల్లి మసీదు ప్రసిద్ది చెందిన మసీదులుగా ఉన్నాయి. నగరం యొక్క మరొక ఆకర్షణగా సీరలమ్మన్ ఆలయం ఉన్నది. ఇది నగోరేపట్టినచేర్రి విలేజ్ (ఒక మత్స్యకార గ్రామం) లో ఉన్నది. అంతేకాక నాగూరు రైలు స్టేషన్ చాలా దగ్గరగా ఉంది.

ప్రతి సంవత్సరం సీరలమ్మన్ పండుగను ఆలయంలో 10 రోజులు జరుపుకుంటారు. నాగూరులో ప్రతి సంవత్సరం అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో జరిగే కందూరి వేడుకలో ప్రయాణికులు పాల్గొనవచ్చు. నగరంలో మారియమ్మన్ దేవాలయం,ఆంజనేయ స్వామి ఆలయం,శివుని గుడి మరియు పెరుమాళ్ కోయిల్ వంటి ఇతర సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.

నగరంలో ఆలయాలు,మసీదులు మరియు పుణ్యక్షేత్రాలే కాకుండా బాగా పర్యాటక మరియు స్పోర్ట్స్ కార్యకలాపాలకు ప్రసిద్ధిచెందిన ఒక బీచ్ ఉంది. దేశం మొత్తంలో ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి అన్ని మతాలకు చెందిన పర్యాటకులు నాగూరును సందర్శించడానికి వస్తారు.

నాగూరు చేరుకోవడం ఎలా

నాగూరు రైలు,విమాన మరియు రోడ్డు మార్గాల ద్వారా తమిళనాడులోని నగరాలకు అనుసంధానం చేయబడింది. నగరంనకు చెన్నై మరియు తిరుచ్చితో నిత్యకృత్యంగా ఒక రైల్వే జంక్షన్ ఉంది. నాగూరు దగ్గరగా ఉండే విమానాశ్రయాలు చెన్నై మరియు తిరుచ్చి విమానాశ్రయాలుగా ఉన్నాయి.

నాగూరు వాతావరణము

ఈ నగరం సముద్రమునకు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది తీర ప్రాంత వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

 

నాగూరు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నాగూరు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నాగూరు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నాగూరు

  • రోడ్డు ప్రయాణం
    నాగూరు నగరం తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాలకు అలానే కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ లో పట్టణాలకు బస్సు నెట్వర్క్ చాలా బాగుంటుంది. ప్రయాణికులు నాగూరు నుండి కన్యాకుమారి,తిరుచ్చి, చెన్నై,తంజావూర్,త్రివేండ్రం,మధురై మరియు పాండిచ్చేరి లకు రోజువారీ బస్ సేవలు పొందవచ్చు. డీలక్స్ పర్యాటక బస్సులు నాగూరు మరియు దక్షిణ భారతదేశం యొక్క అనేక ముఖ్యమైన నగరాల మధ్య కూడా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    నాగూరు సమీపంలోని రైల్వే స్టేషన్ 5 కిమీ దూరంలో నాగపట్నంలో ఉన్నది. ఈ రైలు స్టేషన్ తిరుచ్చి మరియు చెన్నై ద్వారా భారతదేశం యొక్క అన్ని ముఖ్యమైన పట్టణాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నాగూరు సమీపంలో విమానాశ్రయం నగరం నుండి దాదాపు 140 కిమీ దూరంలో ఉన్న తిరుచ్చి విమానాశ్రయంగా ఉంది. ఇది సాధారణ విమానాల ద్వారా చెన్నై విమానాశ్రయంనకు లింక్ ఉంటుంది. నాగూరు నుండి చెన్నై విమానాశ్రయం సుమారు 300 కిమీ దూరం ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun