కుంబకోణం - దేవాలయాలు పుట్టిన పట్టణం !

అందమైన కుంబకోణం పట్టణం సమాంతరంగా ప్రవహించే రెండు నదుల మధ్య ఏర్పడింది. ఒక వైపు కావేరి మరో వైపు అరసలర్ నదులు ప్రవహిస్తాయి. కుంబకోణంకు ఉత్తరం లో కావేరి, దక్షిణం లో అరసలర్ నదులు ప్రవహిస్తాయి. ఈ చిన్న పట్టణం తమిళ్ నాడు లోని తంజావూర్ జిల్లాలో కలదు.

కుంబకోణం చరిత్ర పరిశీలిస్తే, ఈ టవున్ సంగం పాలకుల కాలం నాటిది. ఈ ప్రదేశాన్ని దక్షిణ భారత దేశం పాలించిన ప్రధాన రాజ కుటుంబాలైన చోళులు, పల్లవులు, పాండ్యులు, మదుర నాయకులూ, తంజావూర్ నాయకులూ తంజావూర్ మరాఠాలు పాలించారు. ఈ టవున్ 7వ శతాబ్దంలో ప్రాధాన్యతలో వుండేది. మరో మారు అది బ్రిటిష్ పాలనలో అత్యధిక ప్రాధాన్యతను, వైభవాన్ని పొందింది. కాలాలకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక విద్యలకు పేరొంది దక్షిణ భారత \దేశ కేం బ్రిజ్ విశ్వ విద్యాలంగా పేరు పడింది.

ఆలయాల పట్టణం

కుంబకోణంలో అనేక దేవాలయాలు వుండటంతో ఈ నగరాన్ని సిటీ అఫ్ టెంపుల్స్ అంటారు. కుంబకోణం మునిసిపాలిటి ప్రాంతంలో 188 టెంపుల్స్ కలవు. టవున్ కు చుట్టుపట్ల మరొక 100 టెంపుల్స్ వరకూ కలవు. కుమ్బెస్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్ లు ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ టవున్ లో మహామాహం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కుంబకోణంకు వస్తారు.

ఈ పట్టాణాన్ని పాలించిన పాలకులు అనేక దేవాలయాలను వారి పాలనలో పట్టణం లోనే నిర్మించారు. వీరిలో చోళులు ప్రధానమైన వారు. వీరు సుమారు రెండు శతాబ్దాల పాటు కుంబకోణంను వారి రాజధాని గా చేసుకున్నారు. కుమ్బెస్వర టెంపుల్ 7వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించ బడింది. ఈ శివాలయం టవున్ లో అతి ప్రాచీనమైనది. ఈ పట్టణాన్ని పాలించిన పాలకులు ఒకరిని మించి మరి ఒకరు ఘనమైన రీతిలో ఆలయ నిర్మాణాలను సాగించారు. కుంబకోణంలో ఒక బ్రహ్మ దేముడి దేవాలయం కూడా కలదు. ప్రపంచంలో బ్రహ్మకు అతి కొద్ది ఆలయాలు మాత్రమే కలవు. వాటిలో కుంబకోణం బ్రహ్మ దేవాలయం ఒకటి.

యాత్రికుల అభివృద్ధి.

కుంబకోణంలో హిందూ టెంపుల్స్ మాత్రమే కాక, అనేక మట్ లు కూడా కలవు. శంకర మట్, వెల్లర్ మట్ , రాఘవేంద్ర మట్ , అహోబిల మట్, వైష్ణవ మట్ వంటివి కూడా వివిధ పాలకులు నిర్మించారు. కుంబకోణం లో పట్టేస్వరం దుర్గ టెంపుల్, ఉప్పిలప్పాన్ టెంపుల్, సోమేశ్వర టెంపుల్ మరియు కంబహరేస్వర్ టెంపుల్ లు కూడా ప్రసిద్ధి చెందినవే.

ఇన్ని ఆలయాలు, మట్ లు కల కుంబకోణం హిందువులకు ప్రసిద్ధ యాత్రా క్షేత్రంగా పేరు పడింది.

వాతావరణం మరియు ప్రయాణ సౌకర్యాలు

కుంబకోణం సందర్శనకు వింటర్ నెలలు అనుకూలం. ఈ సమయంలో యాత్రికులు, మరియు పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తారు. కుంబకోణం రోడ్డు, మరియు ట్రైన్ మార్గాలలో తేలికగా చేరవచ్చు.

Please Wait while comments are loading...