సర్వరాయ ఆలయాన్ని (శెవరాయ ఆలయం) అందమైన సేర్వరాయన్ కొండలపై వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. ఒక పల్చటి గుహలో ఉన్న ఈ ఆలయం కావేరి దేవత, సర్వరాయునికి చెందినది. కావేరి దేవత కావేరి నదికి ప్రాతినిధ్యం వహించగా, సర్వారాయుడు సర్వరాయ కొండకు ప్రతిరూపం. కావేరిని, సర్వరాయుడ్ని పరిసర గ్రామాలను కాపాడే దేవదూతలుగా పరిగణిస్తారు.
ఈ ఆలయగుహ ఎంతో లోతుగా ఉండటం వలన కావేరి నదిని తాకుతుందని విశ్వసిస్తారు. మే నెలలో ఈ ఆలయం చుట్టూ ప్రజలు వార్షిక పండుగను జరుపుకోవడానికి గుమిగూడుతారు. ఈ అందమైన కొండలను ఒక సారి సందర్శిస్తే ఎర్కాడ్ సుందర దృశ్యాలను చూసి పర్యాటకులు ఆనందించవచ్చు. ఈ కొండల పై నుండి కనబడే దృశ్యం ఏ పర్యాటకుడైన చూడదగినదే. ఒకవేళ మీరు మతపర ఆసక్తి లేకపోయినప్పటికీ మీ పర్యాటక ప్రణాళికలో ఈ ఆలయాన్ని జత చేసుకొనండి, ఈ కొండల శోభ, ఆకర్షణే కాక కొండల అందమైన దృశ్యాలు కూడా మిమ్మల్ని తప్పనిసరిగా ఉత్కంఠ కు గురిచేస్తాయి.