Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎర్కాడ్ » వాతావరణం

ఎర్కాడ్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం పర్వతకేంద్రమైనప్పటికి ఎర్కాడ్ లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండవు, ఏడాది పొడవునా కేవలం ఆహ్లాదకరమైన చక్కటి ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎర్కాడ్ లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 28,15 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఎర్కాడ్ సందర్శనకు వర్షాకాలం తప్ప మిగిలిన అక్టోబర్, జూన్ మధ్య కాలం ఉత్తమంగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం ఎర్కాడ్ లో వేసవి కాలం మార్చి నెలలో ప్రారంభమై జూన్ నెల వరకు ఉంటుంది. సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వేసవిలో భయపెట్టే వర్షాలతో చెమట కూడా ఎక్కువగా పడ్తుంది. చల్లటి గాలులు వలన రాత్రిపూట చాల చల్లగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఎర్కాడ్ లో వర్షాకాలం జూలై లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలం ఎర్కాడ్ లో బలమైన గాలులను, భారీ వర్షాలను కల్గిస్తుంది.ఎర్కాడ్ లో నమోదు చేయబడిన సగటు వర్షపాతం 279 మిల్లీమీటర్లు. ఉష్ణోగ్రత తగ్గి సాధారణంగా 14-20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. చెమట ఎక్కువగా పట్టినందున ఉన్నదాని కంటే ఎండ ఎక్కువగా అనిపిస్తుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. పొగమంచు, చలి శీతాకాలంలోని లక్షణాలు. జనవరి నెల సాదారణంగా బాగా చల్లగా ఉంటుంది. పగటి పూట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉండి తిరిగి 10 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది.