Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పూంపుహార్

పూంపుహార్ – గత౦లో సందడిగా వున్న ఓడ రేవు !!

13

పూంపుహార్ లేదా పుహార్ తమిళనాడు లోని నాగపట్టినం జిల్లా లోని పట్టణం. ప్రాచీన కాలంలో రద్దీగా ఉండే కావేరీ పుహం పట్టినం అనే రేవుగా ఇది ప్రసిద్ది చెందింది. ఒకప్పుడు తమిళనాడును పాలించిన చోళరాజుల రాజధానిగా కూడా ఈ పట్టణం ఉండేది. కావేరీ నది సముద్రంలో కలిసే ప్రదేశానికి దగ్గరలో ఈ పట్టణం ఉంది. క్రీశ 500 లో ఒక సునామీవల్ల ఈ నగరంలో చాలాభాగం దెబ్బతింది. అయినప్పటికీ ప్రాచీన కాలానికి చెందిన టెర్రకోట శిల్పాలు, కుండలు లాంటివి పూంపుహార్ లో బైటపడ్డాయి. తమిళనాడులో అతిప్రాచీన జనావాసంగా కూడా పూంపుహార్ ప్రసిద్ధిచెందింది. ఈనాటి పూంపుహార్ లో స్త్రీ పురుషులు, పిల్లలు కలిసి షుమారు 86000 మందికి పైగా నివసిస్తున్నారు.

పూంపుహార్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు

మాసిలమని నాతార్ కోవిల్, సిలప్పతికరా ఆర్ట్ గాలరీ అనే రెండు ప్రముఖ నిర్మాణాలు పూంపుహార్ కి ప్రతి ఏటా పర్యాటకులను ఆకర్షిస్తాయి. 14వ శతాబ్దంలో నిర్మించిన మాసిలమని నాతార్ కోవిల్ సముద్రపు ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. ఆనాటి నిర్మాణశైలికి ఇప్పటికీ ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది.

తమిళ పురాణం సిలప్పతికార౦కు గుర్తుగా నిర్మించిన సిలప్పాతికార ఆర్ట్ గాలరీ 7 అంతస్తుల భవంతి. పూంపుహార్ లో వెళ్ళినపుడు తప్పక చూడవలసిన ప్రదేశం. డేనిష్ గవర్నర్ గారి బంగాళా, పట్టణ ప్రవేశద్వారం, పూంపుహార్ సముద్ర తీరం, జియాన్ చర్చ్ ఇక్కడి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

పూంపుహార్ చేరుకోవడం ఎలా ?

పూంపుహార్ రోడ్డు మార్గం ద్వారా తేలికగా చేరుకోవచ్చు. నాగపట్టినం, త్రిచీ పూంపుహార్ కి సమీప నగరాలు. ఇక్కడికి రైలుద్వారా కూడా చేరుకోవడం తేలిక. పూంపుహార్ కి రైల్వే స్టేషన్ లేదు. కానీ ఇక్కడికి దగ్గరలో ఉన్న నాగపట్టినం రైల్వే స్టేషన్ కు బస్సుద్వారా చేరుకోవచ్చు.

పూంపుహార్ వాతావరణం

కోస్తా ప్రాంతం కావడంవల్ల ఏడాదిలో ఎక్కువ భాగం పూంపుహార్ వాతావరణం వేడిగా, తేమగా ఉంటుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది, కానీ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో సంవత్సరంలో మిగిలిన సమయం కంటే చాలా చల్లని వాతావరణం ఉంటుంది. పూంపుహార్ సందర్శనకు ఇదే ఉత్తమ సమయం.

పూంపుహార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పూంపుహార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పూంపుహార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పూంపుహార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా పూంపుహార్ వెళ్ళడానికి సులభమైన మార్గాలలో రోడ్డుమార్గం ఒకటి. నాగపట్టణం వంటి సమీప స్థలాల నుండి రోజువారీ బస్సులు నడుస్తాయి. ఇది తేలికైన, చౌకైన ఎంపిక. అదే విధంగా త్రిచి వంటి సమీప ప్రదేశాల నుండి కూడా రోజువారీ బస్సు సర్వీసులు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా పూంపుహార్ కి నాగపట్టినం సమీప రైల్వే స్టేషన్. నాగపట్టణం నుండి పూంపుహార్ ప్రయాణానికి బస్సు సరైన ఎంపిక. నాగపట్టణం రైలు ద్వారా అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది, ఒక వ్యక్తికీ బస్సు టికెట్ ఖరీదు 50 రూపాయలు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా 148 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉన్న త్రిచి సమీప పట్టణం. తమిళనాడు రాజధాని చెన్నై పూంపుహార్ కి 256 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయుమార్గం ద్వారా రెండు నగరాలను తేలికగా చేరుకోవచ్చు. పూంపుహార్ రెండు నగరాలకు రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది; అందువల్ల ఇక్కడ చెప్పిన నగరాల నుండి విమానంలో చేరుకోవచ్చు, తరువాత బస్సు లేదా అద్దె కాబులలో పూంపుహార్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue