విశిష్ట నిర్మాణ శైలిలో ఉండే సిలప్పతికార ఆర్ట్ గాలరీ 7 అంతస్థుల భవనం. తమిళ పురాణం సిలప్పాతికారం లోని కళాకృతుల సంరక్షణ కోసం ఈ భవనాన్ని నిర్మించారు. ఈ పురాణం లో కోస్తా తీర పట్టణం పూంపుహార్ ప్రస్తావన వుంది. ఈ గాలరీ లోని మొదటి అంతస్తు 12 అడుగుల ఎత్తులో వుండగా, మిగతా అంతస్తులన్నీ 5 అడుగులఅడుగుల ఎత్తులో వున్నాయి. ఈ గాలరీ లో వున్న చాలా కలశాలు కూడా 8 అడుగుల ఎత్తులో వుంటాయి. ఈ నిర్మాణం మొత్తం ఎత్తు 50 అడుగులు వుంటుంది. ఈ నిర్మాణం గోడల పై వున్న శిల్పాలను మామల్లాపురం ఆర్ట్ కాలేజ్ విద్యార్ధులు చెక్కారు. ఈ నిర్మాణ శైలి ఈ పురాణం లోని ఇతివృత్తాల నుంచి స్ఫూర్తి పొందింది. ఈ భవనం ఆవరణలో కడియం ఆకారంలో వుండే నీటి కొలనుకు అటూ ఇటూ కన్నగి, మాధవి విగ్రహాలు వుంటాయి. 22 అడుగులఅడుగుల ఎత్తులో వుండే మకర తోరణం గాలరీ ప్రవేశ ద్వారం మీద అలంకరించ బడి వుంటుంది. ప్రతి ఏటా అనేకమంది పర్యాటకులను ఆకర్షించే ఈ భవంతి పూంపుహార్ లోని ప్రసిద్ధ ఆకర్షణ.