Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ముదుమలై

ముదుమలై - ప్రకృతి అందాల కలగూరగంప!

18

మూడు రాష్ట్రాలు కలిసే చోట (కర్నాటక, తమిళనాడు, కేరళ) దట్టమైన నీలగిరి అడవుల్లో వున్న ముదుమలై వన్యప్రాణి అభయారణ్యానికి ప్రసిద్ది చెందింది. దక్షిణ భారత దేశంలోనే పెద్దదిగా పేరుపడ్డ ఈ అభయారణ్యం అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ది చెంది౦ది. 1940 లో స్థాపించిన ముదుమలై దేశంలోని విస్తారమైన వృక్ష, పశు సంపదను కాపాడి, స౦రక్షించడానికి జరిగిన ప్రముఖమైన, అందమైన ప్రయత్నం. ఈ ప్రాంతంలో ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ,ముదుమైలై లో చాల అద్భుతమైన, అరుదైన, మరెక్కడా కానరాని జాతుల పుష్ప, ఫల జాతులు కొలువై వున్నాయి. ఈ అందమైన అడవికి స్వాగతం!

ముదుమలై అభయారణ్యంలో అటవీశాఖ వారు నిర్వహించే జంగిల్ సఫారీలు నిజంగా చూడతగ్గవి. ఇక్కడి జీవ జాతుల వైవిధ్యంతో పాటు రకరకాల అడవులు కూడా ఈ సఫారీలను జీవితకాల అనుభవంగా మారుస్తాయి. ఉష్ణ మండలీయ తేమతో కూడిన ఆకురాల్చు అడవులు, దక్షిణ ఉష్ణ మండల ముళ్ళ అడవులు, ఉష్ణ మండల పొడి ఆకురాల్చు అడవులు ఈ అభయారణ్యంలో వున్నాయి. పక్షి ప్రేమికులకు ఇక్కడ రెండు వందలకు పైగా జాతులను చూసే అవకాశం వుంది. జంతు జాతుల్లో మానిటర్ బల్లులు, హయనాలు, తోడేళ్ళు, జింకలు, చిరుతపులులు, దుప్పులు ఇక్కడి పచ్చని, ప్రశాంత వాతావరణంలో సహజీవనం చేస్తూ వుంటాయి. భారత దేశంలోని అత్యధిక పులుల సాంద్రత కలిగిన ఒక పులి అభయారణ్యం కూడా ఇక్కడ వుంది. పైగా, ఈ అభయారణ్యంలో ఏడు వందలకు పైగా ఏనుగులు స్వేచ్చగా తిరుగుతూ వుంటాయి. ఎన్నో అంతరించిపోతున్న జాతుల (వృక్ష, పశు, పక్షి) ఆలవాలమైన ఈ అభయారణ్యం దేశంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. అడవి బియ్యం, పసుపు, అడవి అల్లం, దాల్చిన చెక్క, మామిడి, జామ, మిరియాలు ఈ అభయారణ్యంలో విస్తారంగా పెరుగుతాయి – అందువల్ల ఈ మొక్కల నిల్వ జన్యు సమూహానికి దోహదం చేస్తాయి. ఈ మొక్కలు అక్కడక్కడా వుండే శాకాహార వన్యప్రాణులకు పుష్కలంగా ఆహారం అందిస్తున్నాయి. ఇక్కడ పెరిగే రెండు రకాల వెదురు మొక్కలు (బా౦బూసా & డే౦డ్రోకేలామస్ స్త్రిక్టస్) ఏనుగులు, గౌర్ లు లాంటి పెద్ద ప్రాణులకు ఆహారం అందిస్తాయి.

ముదుమలై పరిసరాలు

ముదుమలై పరిసరాల్లో చాలా ఆకర్షణలు వున్నాయి – వాటిలో పైకారా సరస్సు, కల్లట్టీ జలపాతాలు, తెప్పకాడు ఏనుగుల శిబిరం, మోయార్ నది, వంయప్రానులను కలుసుకోడానికి చాలా అధ్బుతమైన ప్రద్శాలు వున్నాయి. ఈ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి రోడ్డు రవాణా సౌకర్య౦ ముదుమలైని ఋతువులతో సంబంధం లేకుండా తరచుగా వెళ్ళే గమ్యస్థానంగా మారుస్తాయి. ఇక్కడి ప్రాకృతిక అందంతో, చూడదగ్గ ప్రదేశాలు, పర్వతారోహణ అవకాశాలతో ముదుమలై కుటుంబంతో సహా ఒక్క రోజు పర్యటనలకు, సాహస పర్యటనలకు వెళ్ళడానికి తగిన విహార కేంద్రంగా పని చేస్తుంది.

ముదుమలై ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముదుమలై వాతావరణం

ముదుమలై
24oC / 74oF
 • Moderate or heavy rain shower
 • Wind: SE 1 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముదుమలై

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ముదుమలై

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుమార్గం ద్వారా ముదుమలై వన్యప్రాణుల అభాయరన్యానికి సమీపంలో ఉన్న పట్టణం గుడలుర్. ఇది ఉదగమండలం –మైసూర్ జాతీయ రహదారిపై 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం, మైసూర్, సమీప పట్టణాల నుండి ముదుమలై వన్యప్రాణుల అభాయరణ్యానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అనేక మలుపుల వంపులు ఉన్నాయి, అందువల్ల ఈ ప్రాంతానికి డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండడం అవసరం.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం ద్వారా నీలగిరి మౌంటెన్ రైల్వే సర్వీసు లో ఉన్న ఉదగమండలం ముదుమలై కి సమీప రైల్వే స్టేషన్. ఇది ముదుమలై నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం స్టేషన్ నుండి ముదుమలై కి టాక్సీ అద్దె షుమారు 1500 రూపాయలు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు సౌకర్యవంతంగా ఉన్న సమీప బ్రాడ్ గేజ్ స్టేషన్. ఇది ముదుమలై నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా పీలమేడు వద్ద ఉన్న కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ముదుమలై కి సమీప విమానాశ్రయం. ఇది ముదుమలై నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి విమానాలు అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముదుమలై కి టాక్సీలు షుమారు 3500 రూపాయల ఖర్చుతో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి

ముదుమలై ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jun,Tue
Return On
26 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
25 Jun,Tue
Check Out
26 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
25 Jun,Tue
Return On
26 Jun,Wed
 • Today
  Mudumalai
  24 OC
  74 OF
  UV Index: 5
  Moderate or heavy rain shower
 • Tomorrow
  Mudumalai
  21 OC
  70 OF
  UV Index: 5
  Moderate or heavy rain shower
 • Day After
  Mudumalai
  20 OC
  68 OF
  UV Index: 5
  Moderate or heavy rain shower