Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముదుమలై » వాతావరణం

ముదుమలై వాతావరణం

ఉత్తమ సమయం పర్వతారోహణకు, స్థల సందర్శన మొదలైన వాటికి అనువుగా ఉండే వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే సమయంలో ముదుమలై సందర్శించడం ఉత్తమం. జూన్ లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం కూడా మంచి ఆలోచనే. అక్టోబర్ లో అధిక వర్షాలు ఉంటాయి, పర్వతారోహణకి నవంబర్ నెల ఆటంకంగా ఉంటుంది, పొడి వాతావరణం ఉన్న ఈ సమయంలో ముదుమలై నేషనల్ పార్కు సందర్శనకు తెరిచి ఉండదు.

వేసవి

వేసవి వేసవిలో ముదుమలై పొడి వాతావరణాన్ని కలిగిఉంటుంది. ఆకురాల్చు అడవులు తరచుగా ఆకులు రాలుస్తూ ఉంటాయి, ఈ నీటి రంధ్రాల చుట్టూ జంతువులూ కనిపిస్తాయి. వేసవి సమయంలో చిన్న అడవులు కాలిపోవడం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో ఆ ప్రాంతాన్ని సందర్శించే వారు తేలికపాటి దుస్తులు, ట్రౌసర్లు, వాకింగ్ షూలు, సన్ స్క్రీన్ వంటి వస్తువులను తమతో తీసుకువెళ్ళాలి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత సాధారణంగా 16 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్య ఉంటుంది. ముదుమలై లో వర్షపాతం స్థిరంగా ఉండదు, బలమైన గాలులతో కూడిన కొద్దిపాటి జల్లులను అంచనా వేయవచ్చు. ఒక గొడుగు, విండ్ చీటర్, జీన్స్ జత, టీ షర్టులను తీసుకువెళ్ళవలసినదిగా సిఫార్సుచేయబడినది.

చలికాలం

శీతాకాలం స్పష్టమైన ఆకాశం, ఆహ్లాదకరంగా ఉండే చల్లని రాత్రులు, వేసవి రోజులు ఈ సీజన్లో ఏమి ఉన్నాయో ఉత్సాహంగా చూడవచ్చు. ఈ సమయంలో పగలు సాధారణంగా ఉన్నతంగా ఉంటుంది. సాయంత్రాలు కొంచెం చల్లగా ఉంటాయి, అందువల్ల మీరు మీ సాధారణ దుస్తులతో పాటు స్వెటర్ ని కూడా తీసుకువేల్లవలసినదిగా సూచన.