ధరంఘర్, ఒడిష లోని కలహండి జిల్లాలోని ఒక ఉప విభాగపు ప్రధాన కార్యాలయం. దీనిని కలహండి ధాన్యాగారమని కూడా అంటారు. ఒడిష లోని వరి ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రాలలో ధరంఘర్ ఒకటి. ధరంఘర్ లోను, చుట్టూ ఉన్న అనేక పురాతన, ప్రత్యేక ఆలయాల వలన ఇది ఎంతో ప్రసిద్ది చెందింది. ధరంఘర్ పర్యాటక రంగం ఉన్నతమైన కొండలు, ఉధృతమైన జలపాతాలు, గుసగుసలాడే అడవులు, అక్కడక్కడ ఉన్న పచ్చికభూములతో నిండిన అద్భుతమైన ప్రకృతితో అనేక మందిని ఆకర్షిస్తుంది.
ధరంఘర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు
ధరంఘర్, శ్రీ అరబిందో, శ్రీ మా వంటి పవిత్ర ప్రాచీన చిహ్నాలకు పుట్టిల్లు. ధరంఘర్ పర్యటనకు ఈ దివ్య ప్రాచీన చిహ్నాలను చూడటానికి అనేక మంది పర్యాటకులు విచ్చేస్తారు. అంపని, దోఖరి చంచ్ర వంటి అద్భుతమైన జలపాతాలు ధరంఘర్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కొన్ని పురాతన ఆలయాలు లంకేశ్వరి,
కనక దుర్గలతో బాటు ఇంకా అనేకం జునాగడ్ పట్టణంలో ఉన్నాయి. గుడహండి ప్రాంతం ప్రాకృతిక సౌందర్యంతో బాటుగా కొన్ని పురాతన ప్రాచీన చిహ్నాలతో ఆశీర్వదించబడింది.
దట్టమైన పచ్చటి అడవులు, కొండల మధ్య ఉన్న ముఖిగూడలోని ఇంద్రావతి ఆనకట్ట ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఖైర్పదర్, గోలముండా వంటి చిన్న గ్రామాలు అందమైన భూభాగాలను పర్యాటకులకు అందిస్తున్నాయి. ధరంఘర్ లోని మరొక చిన్న గ్రామం కొక్సర. ఈ గ్రామానికి చెందిన నిపుణులైన వివిధ కళాకారులు తయారుచేసిన రాతి కళల వలన ఈ గ్రామం ప్రసిద్ది చెందింది. శివాలయం, దంతేశ్వరి ఆలయం, బుద్ధరాజ ఆలయం, శ్రీ జగన్నాథ ఆలయం వంటి కొన్ని పురాతన ఆలయాలకు ఇది పుట్టిల్లు.
ధరంఘర్ పర్యటనకు ఉత్తమ సమయం
ధరంఘర్ లో సెప్టెంబర్, మార్చి మధ్యలో పర్యాటకరంగం ఊపందుకుంటుంది.
ధరంఘర్ చేరడం ఎలా
దక్షిణ ఒడిష లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటైనందున ధరంఘర్ కు చక్కటి రోడ్డు, రైలు సేవలు ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన అనేక బస్సులు, ప్రైవేట్ లగ్జరీ బస్సులు పర్యాటకులకు సేవల నందిస్తున్నాయి. ట్రావెల్ కంపెనీలు సందర్శకులకు ధరంఘర్ లోని ప్రధాన పర్యాటక గమ్యస్థానాలకు చేరడానికి అనేక పర్యాటక ప్యాకేజీలను అందిస్తున్నాయి.



Click it and Unblock the Notifications