జునాగడ్, ధరంఘర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల వలన జునాగడ్ పేరును సంతరించుకుంది. ఈ ఆలయాలలో కనబడే అనేక ఒరియా శాసనాలు క్రూరమైన సతి ఆచారాన్ని ఈ ప్రాంతంలో ఆచరించేవారని తెలియచేస్తున్నాయి. యుద్ధానికి దేవతగా విశ్వసించే లంకేశ్వరి మాతకు చెందిన ప్రసిద్ధ లంకేశ్వరి ఆలయం ఈ ప్రాంతానికే గర్వకారణం. ఈ దేవత గౌరవార్ధం ఖండబాస పండుగను ఎంతో ఉత్సాహ౦, ఆరాధనతో జరుపుకుంటారు.
దధి బామన్, భైరవ్ గుడి, కనకదుర్గ వంటి ఇతర ఆలయాలు జునాగడ్ లోని ఆలయాలలో ముఖ్యమైనవి. దుర్గాపూజ, గణేష చతుర్ధిలను జునాగడ్ అంతటా భారీ సంఖ్యలో ఎంతో సంబరంగా జరుపుకుంటారు. జోజ్న నది పై రాతి కొండల నడుమ కట్టిన జోజ్న ఆనకట్ట చూడదగిన అద్భుతమైన ప్రదేశం. పచ్చటి అడవుల మధ్యలోని పల్మఝారన్ అనే ఒక చిన్న జలపాతం అనేకమంది స్థానికులు, పర్యాటకులకు కూడా ఒక విహారయాత్ర ప్రాంత౦.



Click it and Unblock the Notifications