చిన్మయ తపోవన్, హిందూ అధ్యాత్మిక నేత, మత బోధకుడు బాలకృష్ణన్ మీనన్ ధర్మశాలలో స్థాపించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ఆశ్రమానికి బాలకృష్ణన్ గురువు స్వామి తపోవన్ పేరు పెట్టారు. బిందు సరస నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం చిన్మయ గ్రామీణ ప్రాధమిక ఆరోగ్య, శిక్షణా కేంద్రంగా సేవలందిస్తుంది. ఇంతేకాక గొప్ప భారతీయ ఇతిహాసం ‘గీత’ పై స్వల్పకాలిక కోర్సులను కూడా ఇక్కడ అందిస్తున్నారు.
హనుమ౦తుడి 9 అడుగుల ఎత్తైన ఒక విగ్రహం ప్రవేశద్వారం వద్ద సందర్శకులకు ఆశ్రమానికి స్వాగతం పలుకుతుంది. పర్యాటకులు ఇక్కడి ఒక పుస్తకాల షాపులో పుస్తకాలు, సి డి లు కొనుగోలు చేయవచ్చు.శక్తివంతమైన హిమాలయ పర్వతపంక్తుల మధ్య ఉన్నఈ ఆశ్రమం తన ప్రశాంత పరిసరాలలో పర్యాటకులకు విశ్రాంతి తీసుకొనే అవకాశాన్ని అందిస్తుంది.



Click it and Unblock the Notifications