ధర్మశాల నుంచి 11 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1775 మీటర్ల ఎత్తున వున్న ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు. చుట్టూ దట్టమైన పచ్చటి దేవదారు చెట్లతో వుండే ఈ సరస్సు మెక్లియాడ్ గంజ్ నుంచి నద్దీ గ్రామానికి వెళ్ళే దారిలో వుంది. ధర్మశాల, మెక్లియాడ్ గంజ్ లలో పర్వతారోహణ చేసే వారికి దాల్ సరస్సు బేస్ కాంప్ గా పనిచేస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ఈ సరస్సు ఒడ్డున ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సరస్సు లో మునక వేస్తె బాధలు అన్నీ తొలగిపోయి శివుడి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడికి దగ్గరలో దుర్వాస మహాముని కోసం నిర్మించిన దేవాలయం కూడా చూడదగ్గది.



Click it and Unblock the Notifications