ధర్మశాల క్రికెట్ స్టేడియం, ధర్మశాల లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ అంతర్జాతీయ స్టేడియం స్థానిక క్రికెట్ జట్లకు దేశీయ ఆటమైదానంగా కూడా ఉపయోగపడుతుంది. సహజ మంత్రముగ్ధ నేపధ్యంలో ఉన్న ఈ స్టేడియాన్ని భారతదేశంలోని అత్యంత అందమైన స్టేడియాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ స్టేడియం, కొన్నిసార్లు పర్యాటకులకు అంతర్జాతీయ, రంజీ క్రికెట్ పోటీలు చూసే అవకాశాన్ని కల్గిస్తుంది. స్టేడియం నుండి ధవళాధర్ పర్వతపంక్తుల మంచు కొండ శిఖరాలు సులువుగా కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications