ధర్మశాలలో మెక్లియాడ్ గంజ్ లోని సుగ్లగ్ ఖాంగ్ సముదాయంలో వుండే చెప్పుకోదగ్గ పర్యాటక ఆకర్షణ టిబెట్ మ్యూజియం. విశాలమైన ప్రాంతంలో వున్న ఈ మ్యూజియం ధర్మశాలలోని అధునాతనమైన ప్రదర్శనశాల. ఈ మ్యూజియం లో సమావేశాలకు, ప్రదర్శనలకు, వేర్వేరు గదులు వున్నాయి. సాంప్రదాయ టిబెటన్ నిర్మాణాలు, అధునాతన నమూనాల మిశ్రమ శైలిలో వీటిని నిర్మించారు.
పర్యాటకులు ఇక్కడ టిబెటన్ సంస్కృతికి చెందిన చారిత్రిక డాక్యుమెంట్లు, రాత ప్రతులు, తంగ్కా చిత్రాలు, మట్టి పాత్రలు, హస్త కళాకృతులు చూడవచ్చు. పచ్చటి బయళ్ళతో కప్పబడి వుండే ఈ మ్యూజియం లో చిత్రాలు, కళాకృతులు అమ్మడానికి దుకాణాలు కూడా వున్నాయి. మెక్లియాడ్ గంజ్ కు 15 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ మ్యూజియం కు పర్యాటకు టాక్సీల ద్వారా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications