పర్వతారోహణ, ధర్మశాలను సందర్శించే వారిలో ప్రసిద్ధ చర్య. కాంగ్రా లోయనుంచి సముద్రమట్టానికి 4600 మీటర్ల ఎత్తున వుండే ఈ ప్రాంతంలో ధవళాధర్ పర్వతపంక్తుల ఆరోహణకు ప్రారంభకేంద్రం ఉంది. అనేక అద్భుతమైన ఆరోహణ మార్గాలు దేవదారు, పైన్, ఓక్, అడవులు, స్పటిక స్వచ్చమైన కాలువలు, అప్పుడప్పుడు సరస్సులు, హిమనీ నదాల మధ్య నుండి సాగుతాయి.
ఇక్కడి అత్యంత ప్రసిద్ధ పర్వతారోహణ మార్గం ధర్మశాల నుండి ప్రారంభమై సముద్ర మట్టానికి 4350 మీటర్ల ఎగువన ఉన్న ఇంద్రహర్ మార్గం మీదుగా చంబలోయకు దారితీస్తుంది.ఈ పర్వతారోహణా మార్గం పీర్ ప్రాంజల్ పంక్తుల మంచు శిఖరాలు,శక్తివంతమైన హిమాలయా పర్వత శ్రేణుల మంత్రముగ్ధ దృశ్యాలను అందిస్తుంది. మరొక ప్రసిద్ధ పర్వతారోహణ మార్గం ధర్మశాల నుండి ప్రారంభమై బిల్లింగ్, బీర్, పల్చాక్, పనిహర్డు, ఉదేగ్, మర్హు, బరబంఘల్, ధర్దియాండ్ ల గుండా సాగుతూ నాయగ్రాన్ వద్ద అంతమౌతుంది.
ఈ ప్రాంతంలోని అత్యంత క్లిష్టమైన పర్వతారోహణ మార్గం సముద్రమట్టానికి 4580 మీటర్ల ఎగువన ఉన్న భిమ్ఘాసుత్రి మార్గం గుండా వెళ్తుంది. ధర్మశాల నుండి ప్రారంభమై సముద్రమట్టానికి 3710 మీటర్ల ఎగువన ఉన్న బ్లేని మార్గం గుండా దారితీసే మార్గం భిమ్ఘసుత్రి మార్గం నుండి వెళ్ళే పర్వతారోహణ మార్గం కంటే సులువైనది. ఈ పర్వతారోహణ మార్గం చంబ రోడ్డులో దునాలి వద్ద అంతమౌతుంది. ఇక్కడ పర్వతారోహణకు ఉత్తమ కాలం సెప్టెంబర్లో ప్రారంభమై నవంబర్ నెల వరకు ఉంటుంది.



Click it and Unblock the Notifications