ఘోఘ్ల బీచ్, డయ్యు

ఈ బీచ్ డయ్యు నగరానికి 631 కిలోమీటర్ల అవతల ఉన్నది మరియు ఘోఘ్ల గ్రామానికి సమీపంలో ఉన్నది. డయ్యులో ఉన్న పెద్ద, స్వచ్ఛమైన మరియు అద్భుతమైన బీచ్ లలో ఇది ఒకటి. అరేబియా సముద్ర తరంగాలు బంగారు ఇసుకను కంటికి కనిపించేంత దూరంలో ఒక కేంద్రస్థానం వొద్ద పైకి, క్రిందికి మేట వేయటం వలన ఒక సమ్మోహక దృశ్యం సృష్టించబడుతున్నది.

ఈ బీచ్, ఈత, పారాసైలింగ్, సర్ఫింగ్ మరియు ఇతర ఉత్తేజకరమైన వాటర్ స్పోర్ట్స్ వంటి థ్రిల్లింగ్ కార్యకలాపాలకు ఆదర్శవంతంగా ఉన్నది. జలక్రీదంటే ఇష్టపడనివారు మెత్తటి ఇసుకతిన్నెల మీద సేద తీరవొచ్చు. ప్రకృతి ఒడిలో ఒంటరిగా, శాంతి మరియు ప్రశాంతతను కోరుకునే ప్రేమికులకు ఇది ఒక ఆటవిడుపులాగా ఉన్నది. దీనికి చుట్టుపక్కల చెల్లాచెదురుగా ఉన్న డయ్యు మత్స్యకార గ్రామాలు, చర్చిలు మరియు కోటలను ఇక్కడినుండి వీక్షించవొచ్చు. ఇక్కడ ఎక్కువ రోజులు గడపాలనుకునేవారికి రుచికరమైన ఆహారం, సౌకర్యవంతమైన నివాసం మరియు ఇతర సదుపాయాలతో ఉన్న ఒక పర్యాటక కాంప్లెక్స్ ఉన్నది.

Please Wait while comments are loading...