సెయింట్ పాల్ యొక్క చర్చి, డయ్యు

హోమ్ » ప్రదేశములు » డయ్యు » ఆకర్షణలు » సెయింట్ పాల్ యొక్క చర్చి

సెయింట్ పాల్ యొక్క చర్చి; సెయింట్ పాల్, యేసు క్రీస్తు యొక్క క్రైస్తవ బోధకుడి పేరు పెట్టబడింది. డయ్యులో పోర్చుగీసువారు నిర్మించిన మూడు చర్చిలలో, ఇక్కడ మాత్రమే క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశాలు మరియు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ చర్చి 1610 లో నిర్మించారు మరియు పరిశుద్ధ కాన్సెప్షన్ యొక్క అవర్ లేడీకి అంకితం కావించారు. ఈ చర్చి యొక్క రూపకల్పన మరియు నిర్మాణశైలి బరోక్యు ఉత్తమ సంప్రదాయాలకు ఉదహరణగా ఉన్నాయి. చర్చి లోపలిభాగం విస్తృతమైన మరియు కళాత్మకమైన చెక్క పనితో అందంగా తీర్చిదిద్దారు.

బర్మీస్ టేకుతో, ఒకే ముక్కలో చెక్కిన సెయింట్ మేరీ విగ్రహం కలిగివున్న పీఠం ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా పేరుగాంచింది ఎందుకంటే దీని సాంద్రత, దృఢత్వం మరియు దీర్ఘ జీవితం వంటి లక్షణాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది. దీని మీద ఒరుసగా 101 కొవ్వొత్తులను వెలిగించేందుకు సరిపడా స్థలం ఉన్నది. ఈ పీఠం ఎగువ భాగంలో అమూల్యమైన చిత్రాలు మరియు విగ్రహాలతో అలంకరించబడి ఉన్నది.

సమావేశాలు జరిగే చర్చి హాల్ కేంద్ర ప్రాంతంలో ఒక పైకప్పు చర్చి ఉన్నది. స్థానిక కళాకారులచే తెలుపు గారతో చేసిన పూతపనితో చర్చి యొక్క బాహ్యభాగాన్ని, లోపలిభాగం కన్నా అందంగా రూపకల్పన చేశారు.

Please Wait while comments are loading...