Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ద్రాస్ » వాతావరణం

ద్రాస్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: ద్రాస్ పర్యటించాలనుకునే యాత్రికులు, వేసవి కాలంలో, అనగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలం లో సందర్శించడం మంచిది. శీతాకాలంలో పట్టణం మొత్తం మంచు తో కప్పబడి ఉంటుంది కనుక, పర్యాటకులు, ఈ ప్రదేశానికి దూరంగా ఉంటే మంచింది.

వేసవి

వేసవి (జూన్ నుండి సెప్టెంబరు): ఇక్కడ వేసవి కాలం, జూన్ లో మొదలయి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ద్రాస్, గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 24 డిగ్రీలు మరియు 9 డిగ్రీలు గా నమోదు అయ్యాయి. వేసవిలో వాతావరణం ఆహ్లాదంగా ఉండటం వల్ల, ఈ ప్రాంతం లో తిరగటానికి అనువుగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (డిసెంబర్ నుండి మే): ద్రాస్ లో ఎక్కువగా వర్షాలు కురవవు. వార్షిక అవపాతం డిసెంబర్ నుండి మే వరకు నమోదు చేయబడింది. సేకరించిన సమాచారం ప్రకారం, ప్రతి సంవత్సరం, ద్రాస్ లో సుమారు 360 మి.మీ లేదా 14 అంగుళాల అవపాతం మంచు రూపంలో నమోదు అవుతుంది.

చలికాలం

శీతాకాలం (మే మధ్య నుండి అక్టోబర్ మధ్య): ఇక్కడ శీతాకాలంలో అక్టోబర్ మధ్యలో మొదలయి మే మధ్య వరకు ఉంటుంది. ద్రాస్, సైబీరియా తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత శీతల ప్రాంతం గా ఉండటం వల్ల, శీతాకాలంలో -22 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత -45 డిగ్రీల వరకు పడిపోవచ్చు. బయట సంచరించటం కష్టతరంగా గా ఉండే ఈ ప్రతికూల వాతవరణ పరిస్థితుల్లో, యాత్రికులు ఇక్కడికి రాకుండా ఉండటం మంచింది.