ఫతేహాబాద్ లో వాతావరణం ఫతేహాబాద్ లో ఇతర ఉత్తర భారదేశంలోని నగరాలలానే వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సెప్టెంబర్, నవంబర్ మధ్యకాలం ఫతేహాబాద్ సందర్శనకు అనువుగా ఉంటుంది.
వేసవికాలం వడగాలులతో అత్యధికమైన 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన వేసవి కాలం మార్చి, మే నెలల మధ్య ఉంటుంది.
వర్షాకాలంజూలై, సెప్టెంబర్ మధ్య ఉండే వర్షాకాలంలో పట్టణంలో అప్పుడప్పుడు భారీ వర్షాలు కురుస్తాయి.ఈ కాలంలో వాతావరణం తడిగా, తేమగా ఉంటుంది.
శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. 12, 25 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రతతో వాతావరణం తేలికగా, ఆహ్లాదకర౦గా ఉంటుంది.