గడగ్ వాతావరణం ఎలా? గడగ్ సందర్శనకు శీతాకాలం ఎంతో అనువుగా, ఆహ్లాదంగా, శోభాయమానంగా ఉంటుంది.
వేసవి (ఏప్రిల్ నుండి జూన్) - గడగ్ వాతావరణం వేసవిలో వేడి మరియు గాలిలో తేమ అధికంగాను ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు గాను ఉంటుంది. వేసవిలో సందర్శనకు అనుకూలం కాదు.
వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో వర్షాలు అధికంగా ఉంటాయి. అయితే, అక్టోబర్ నెలలో వర్షపాతం తక్కువ. ఈ కాలం పర్యటనకు అనుకూలం కాదు. కనుక పర్యాటకులు ఈ ప్రాంత సందర్శనకు ఇష్టపడరు.
శీతాకాలం (అక్టోబర్ నుండి మార్చి) - ఈ కాలంలో గడగ్ వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలుగాను పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగాను ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.