గంజాం వాతావరణం రోజంతా వీచే చల్లని గాలులతో శీతాకాలం అద్భుతంగా ఉంటుంది. వినోదం, స్థలసందర్శన వంటి వివిధ కార్యకలాపాలతో అన్ని పర్యాటక ప్రదేశాలు పర్యాటకులతో ని౦డి ఉంటుంది. ప్రజలు తరచుగా విస్తారమైన ఆకుపచ్చని అడవుల మధ్య ఉన్న బోన్ఫెయిర్ ని, గంజాం లోని అద్భుతమైన బీచ్ లో సూర్యస్నానం చేసి ఆనందిస్తారు.
వేసవి వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది. వాతావరణం అధిక ఉష్ణోగ్రతతో ఆర్ద్రంగా ఉంటుంది. మే అత్యంత వేడి మాసం. కోస్త ప్రాంతం కావడం వల్ల, గంజాం వేసవిలో అధిక ఆర్ద్రతను కలిగిఉంటుంది. మండేసూర్యుడి వల్ల బతకడం కష్టంగా ఉండడం వల్ల ఈ సమయంలో పర్యటన అనుకూలమైనది కాదు.
వర్షాకాలం నైరుతీ ఋతుపవనాలు జూన్ రెండవ వారంలో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. వర్షాల రాకతో, షుమారు 70% వర్షపాతంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనివల్ల వేడిమి నుండి కొద్ది ఉపశమనం కలుగుతుంది, కానీ ధారాపాతంగా కురిసే వర్షం వల్ల ప్రయాణానికి అనుకూలంగా ఉండదు.
శీతాకాలం అక్టోబర్ నెల చివరిలో నైరుతీరుతుపవానాలు శీతాకాల రాకను సూచిస్తాయి. డిసెంబర్ లో ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోతుంది. శీతాకాలం ఫిబ్రవరి వరకు ఉండి వాతావరణం మహోహరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తారు.