విమాన మార్గం గిరిదిహ్ లో ఏ విమానాశ్రయం లేదు. ఒక ల్యాండింగ్ వైమానిక స్థావరం కొన్ని అవసరాలను నెరవేరుస్తుంది. బోరో ఏరోడ్రోం గిరిదిహ్ ప్రధానకార్యాలయం వద్ద ఉంది. సమీప విమానాశ్రయాలు రాంచి లో బిర్సా ముండా విమానాశ్రయం 208km దూరంలో, గయా విమానాశ్రయం 201 Km దూరంలో, పాట్నాలో లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం 265 కిమీ దూరంలో మరియు కోలకతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం 312 Km దూరంలో ఉన్నాయి.