Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గిరిదిహ్

గిరిదిహ్ - జైనమతం యొక్క కేంద్రం!

36

గిరిదిహ్ జార్ఖండ్ ప్రసిద్ధ మైనింగ్ పట్టణాలలో ఒకటిగా ఉంది. ఉత్తర ఛోటా నాగ్పూర్ డివిజన్ కేంద్రంలో ఉన్నది. గిరిదిహ్ ఉత్తరాన బీహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లా,తూర్పున దెఒఘర్ మరియు జమ్తారా జిల్లాలు,పడమర లో హజారీబాగ్ మరియు కోడెర్మ,దక్షిణంలో ధన్బాద్ మరియు బొకారో లు సరిహద్దులుగా ఉన్నాయి. పాత మరియు అందమైన ఈ కుగ్రామం కొండల నడుమ ఉండుటవల్ల పొరుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తుంది. 1972 లో గిరిదిహ్ జిల్లా కొత్తగా ఏర్పడక ముందు హజారీబాగ్ జిల్లాలో ఒక భాగంగా ఉండేది. ఇది 4853.56km.sq విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. గిరిదిహ్ రూబీ మైకా మరియు బొగ్గు రంగంలో నిల్వ గృహాలను కలిగి ఉంది.

"గిరిదిహ్" అనే పదానికి ఎత్తైన ప్రాంతంలో కేంద్రీకరించిన కొండలు మరియు గుట్టలు గల భూమి అని అర్థం. జిల్లాలో అత్యధిక భాగం అడవులతో కవర్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చాలావరకు సాల్ చెట్లు మరియు వెదురు,స్మాల్,మహు మరియు పాలస్ వంటి చెట్లను కూడా గుర్తించవచ్చు. గిరిదిహ్ లో ఖనిజాలు మైకా వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

గిరిదిహ్ లో సందర్శించవలసిన ప్రదేశాలు

గిరిదిహ్ లో పరస్నాథ్ హిల్స్ లేదా శ్రీ సమ్మెట శిఖర్జి అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా ఉన్నది. ఇది జైన ప్రజల పుణ్యక్షేత్రం. ఇక్కడ 20నుండి 24 జైన తీర్థంకరులు మోక్షం పొందారు. ఇక్కడ జార్ఖండ్ ఎత్తైన పర్వతం శిఖరం వద్ద గ్రానైట్ తయారు చేస్తారు. జిల్లాలో బరాకర్ మరియు సక్రి అనే రెండు ముఖ్యమైన నదులు ఉన్నాయి. మరొక ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా ఉస్రి జలపాతం ఉన్నది. ఇది 13kms దూరంలో ఉన్నది. ఇక్కడ నది 40ft ఏటవాలు ఎత్తు నుండి క్రిందికి పడిపోవడం కనిపిస్తుంది.

ఒక ఆకర్షణీయమైన నీటి రిజర్వాయర్ ఖందోలి ఆనకట్ట ఉన్నది. ఇది పక్షి ఔత్సాహికులకు ఒక ఆసక్తికరమైన ప్రదేశంగా ఉంటుంది. బోటింగ్ మరియు అడ్వెంచర్ కావలిసిన వారికీ రాక్ క్లైంబింగ్, పారాసైలింగ్ మరియు కయాకింగ్ వంటివి ఉన్నాయి. అంతేకాక వాటర్ స్పోర్ట్స్ మరియు ఏనుగు మరియు ఒంటె సఫారీ లను ఆస్వాదించవచ్చు.

హరిహర్ ధామ్ ఒక తీర్ధయాత్ర ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశం యొక్క అతిపెద్ద శివలింగం ఇక్కడ ఉంది. దుఖియ మహాదేవ్ ఆలయం మరియు జార్ఖండ్ ధామ్ వంటి కొన్ని ఇతర యాత్రా కేంద్రాలు ఉన్నాయి. గిరిదిహ్ పట్టణ ప్రాంతం నుండి 15kms దూరంలో ఉన్న జాము మరియు దాని చుట్టూ అత్యద్భుతమైన అందాన్ని మరియు పచ్చదనం కొరకు ప్రసిద్ధిచెందింది.

గిరిదిహ్ వాతావరణము

గిరిదిహ్ లో శీతాకాలాలు మాత్రం చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే పొడి వాతావరణం ఆధిపత్యం చెలాయిస్తుంది.

గిరిదిహ్ చేరుకోవడం ఎలా

రైల్వే మరియు రహదారులు గిరిదిహ్ రవాణాకు ప్రధాన మార్గాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రదేశం బాగా పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లకు బాగా అనుసందానము కలిగి ఉన్నది.

వాతావరణము

సాధారణంగా గిరిదిహ్ లో వాతావరణము పొడిగా ఉంటుంది. తీవ్రమైన వేసవి అలాగే శీతాకాలంలో అసౌకర్యంగా ఉంటుంది. మాన్సూన్ వాతావరణమును ఆస్వాదించవచ్చు.

 

గిరిదిహ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గిరిదిహ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గిరిదిహ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గిరిదిహ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం గ్రాండ్ ట్రంక్ రోడ్ జిల్లా గుండా వెళుతుంది. గిరిదిహ్ రహదారులు ద్వారా బాగా అనుసంధానించబడింది. గిరిదిహ్ NH-2 మరియు NH-100 కూడలి వద్ద ఉంది. బస్ టెర్మినల్ నగరం మధ్యలో ఉండుటవల్ల సులభంగా చేరవచ్చు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. నిరంతరం బస్సు సేవలు ధన్బాద్,బొకారో,రాంచి,జంషెడ్పూర్,హజారీబాగ్ మరియు దెఒఘర్ కు బాగా అనుసందానము కలిగి ఉంటుంది. అంతేకాక అసన్సోల్,దుర్గాపూర్,పశ్చిమ బెంగాల్ లో కోలకతా మరియు హౌరా బీహార్ లో పాట్నా కు బస్సు ద్వారా అనుసంధానం కలిగి ఉంటుంది. రవాణాకు ఇతర మార్గాలుగా అధిరోహణ, ఆటోలు,రిక్షాలు,మినీ బస్సులు మరియు ప్రైవేటు టాక్సీలు కూడా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఒక ప్యాసింజర్ రైలు మధుపూర్ జంక్షన్ నుండి గిరిదిహ్ స్టేషన్ కు ప్రతి రోజు ఐదు సార్లు నడుస్తుంది. వీటి మధ్య 54km దూరం ఉంటుంది. అంతేకాక ఒకే బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ద్వారా అనుసంధానించబడింది. గిరిదిహ్ నుండి 48km దూరంలో మరొక ముఖ్యమైన స్టేషన్ పరస్నాథ్ స్టేషన్ ఉన్నది. నేరుగా ఒక రైలు గిరిదిహ్ నుండి కోలకతా మరియు పాట్నాకు నడుస్తుంది. గిరిదిహ్ నుండి 93 km దూరంలో కోడెర్మ వద్ద ఒక రైల్వే లైన్ ప్రణాళిక సిద్ధం చేయబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం గిరిదిహ్ లో ఏ విమానాశ్రయం లేదు. ఒక ల్యాండింగ్ వైమానిక స్థావరం కొన్ని అవసరాలను నెరవేరుస్తుంది. బోరో ఏరోడ్రోం గిరిదిహ్ ప్రధానకార్యాలయం వద్ద ఉంది. సమీప విమానాశ్రయాలు రాంచి లో బిర్సా ముండా విమానాశ్రయం 208km దూరంలో, గయా విమానాశ్రయం 201 km దూరంలో, పాట్నాలో లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం 265 కిమీ దూరంలో మరియు కోలకతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం 312 km దూరంలో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu