Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జంషెడ్పూర్

జంషెడ్పూర్ – భారతదేశంలోని పారిశ్రామిక నగరం!

17

భారతదేశంలోని పారిశ్రామిక నగరంగా కూడా పిలువబడే జంషెడ్పూర్, లేటు జంషెడ్ జి నుస్సేర్వంజి టాటాచే స్థాపించబడింది. ఇది ఝార్ఖండ్ రాష్ట్రంలో అత్యంత పేరుగాంచిన నగరం, ఇది స్టీల్ సిటీ లేదా టాటానగర్ అని పేరుగాంచింది.

జంషెడ్పూర్, ఝార్ఖండ్ లోని తూర్పు సింఘ్భుం జిల్లలో ప్రధానకార్యాలయం, ఇది కోల్కతా, పాట్నా తరువాత తూర్పు భారతదేశంలో మూడవ అతిపెద్ద నగరం.

ఇది 1000 కంటే ఎక్కువ చిన్న, చిన్న పరిశ్రమలకు నిలయమైన ఆదిత్యపూర్ గా పేరుగాంచిన భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక జోన్ లలో ఒకటి.

జంషెడ్పూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

జంషెడ్పూర్ కూడా పర్యాటకులను ఆకర్షించడం ప్రారంభించింది. ఇక్కడి సమీపంలోని కొండలు, పర్వత శ్రేణులు అన్ని ఇతర ప్రదేశాలకు ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్నాయి.

50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జంషెడ్పూర్ పౌరులకు టాటా స్టీల్ వారు బహుమతిగా ఇచ్చిన జూబిలీ పార్క్ నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ పార్క్ స్థాపకుల రోజుగా గుర్తించబడిన మార్చ్ 3 న అందమైన కాంతుల ప్రదర్శనకు పేరుగాంచింది.

దిమ్నా సరస్సు ఒక కృత్రిమ రిజర్వాయర్, ఇది నగర౦లోని తాగునీటికి ప్రధాన మూలం. ఈ సరస్సు పర్యాటకులకు జెట్ స్కింగ్, రోయింగ్, వాటర్ స్కూటింగ్ వంటి వినోదంతో కూడిన కార్యక్రమాలను అందిస్తుంది.

టాటా స్టీల్ జూలాజికల్ పార్క్ తోపాటు చందిల్ డాం, రివర్స్ మీట్, హుడ్కో సరస్సు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (CE), భాటియా పార్క్, మూల్గోకర్ పార్క్, భువనేశ్వరి ఆలయం మొదలైనవి ఇతర ప్రధాన ప్రదేశాలు ఆశక్తికరమైనవి. నగరం నుండి 40 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన అందానికి ప్రసిద్ది గాంచిన ఘట్సిలా అనేది ఒక చిన్న పట్టణం.

చరిత్ర

జంషెడ్పూర్ ని పూర్వం సక్చి అని పిలిచేవారు, 1918 లోని ఈ సక్చి దాని స్థాపకుడు జంషెడ్ జి నుస్సేర్వంజి టాటాకు నివాళిగా జంషెడ్పూర్ అని పేరుపెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో, జంషెడ్ జి టాటా పిట్స్బర్గ్ వెళ్ళిన తరువాత, భారతదేశంలో మొదటి స్టీల్ కంపెనీ ప్రారంభించాలనే తన కలను నిర్మించడానికి స్థలం కనుగొనడంలో భూగోళ శాస్త్రజ్ఞుల సహాయం కోరాడు.

సహజ వనరులు సమృద్ధిగా ఉన్న సరైన ప్రదేశాన్ని గుర్తించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. చివరిగా ఆ భూమి కనుగొనబడి సాక్చిగా పిలువబడ్డది (ప్రస్తుతం అది టాటానగర్ లో ఒక భాగం), చోటా నాగపూర్ పీఠభూమిలో దట్టమైన అడవిగా విస్తరించి ఉంది.

భౌగోళ శాస్త్రం

జంషెడ్పూర్, ఝార్ఖండ్ రాష్ట్రంలో దక్షిణ మూలలో ఉంది, ఇది పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుతో ఉంది. ఈ నగరం ఖర్కాయి, సువర్ణరేఖ నదుల సంగమం వద్ద ఉంది. ఈ రెండు నదులు ఈ నగర తాగునీరు, గ్రౌండ్ వాటర్ కి ప్రధాన మూలం.

జంషెడ్పూర్ ప్రాధమికంగా ఒక కొండ ప్రదేశం, ఇది దట్టమైన అడవులతో, పడమర నుండి తూర్పుకి నడిచే దాల్మా కొండలతో చుట్టబడి ఉంది.

జంషెడ్పూర్ సందర్శనకు ఉత్తమ సమయం

అక్టోబర్, మార్చ్ మధ్య జంషెడ్పూర్ ను సందర్శించడం ఉత్తమం. అక్టోబర్ మాసంలో ఆహ్లాదకర వాతావరణం ఉండడం వల్ల స్థల సందర్శనకు అనువుగా ఉంటుంది.

 

జంషెడ్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జంషెడ్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జంషెడ్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జంషెడ్పూర్

  • రోడ్డు ప్రయాణం
    జంషెడ్పూర్ రైలు, రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఈ నగరం రైలు, రోడ్డు సర్వీసుల ద్వారా బాగా కలుపబడి ఉంది.జంషెడ్పూర్ రాష్ట్ర, జాతీయ రహదారుల గుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. ముంబై, ఢిల్లీ లను కలిపే 33 వ జాతీయ రహదారి ప్రధాన జాతీయ రహదారి. 6 వ జాతీయ రహదారి ఖరగ్పూర్, కోల్కతా ని కలుపుతుంది. స్థానిక రవాణా కోసం, ప్రయాణీకులు బస్సు, ఆటో రిక్షాలను ఎంచుకుంటారు. ఇది ప్రయాణీకుల రవాణాకు ప్రసిద్ధ విధానం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    టాటానగర్ రైల్వే స్టేషన్ అని కూడా పేరుగాంచిన జంషెడ్పూర్, రాష్ట్రంలోని అత్యంత ప్రధాన జంక్షన్, ఇది హౌరా తరువాత ఆగ్నేయ రైల్వే స్టేషన్లలో రెండవ రద్దీ స్టేషన్. ఈ నగరం కోల్కతా, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూర్, నాగపూర్, భువనేశ్వర్, పూనే వంటి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఆదిత్యపూర్, గంహరియ, కంద్ర, గోవింద్పూర్, సల్గాఝారి ఇతర ప్రధాన స్టేషన్లు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    జంషెడ్పూర్ లో సొనారి అనే చిన్న విమానాశ్రయం ఉంది, ఇది ప్రాధమికంగా టాటా గ్రూప్ అధీకృత విమానాలను తీసుకురావడానికి ఉపయోగిస్తారు. దీనికి షుమారు 289, 130 కిలోమీటర్ల దూర౦వద్ద ఉన్న కోల్కతా, రాంచి సమీప వాణిజ్య విమానాశ్రయాలు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon