రోయింగ్   – అందమైన ప్రకృతిలోని వరుస!

పచ్చని లోయలతో కూడిన మంత్రముగ్ధమైన కొండల భూమి రోయింగ్, అరుణాచలప్రదేశ్ లోని దిగువ దిబంగ్ లోయ జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది తూర్పు అరుణాచల ప్రదేశ్ లో ఒక భాగాన్ని రూపొందిస్తుంది. కొండలు, నదులతో నిండిన ఈ భాగానికి ఉత్తరాన దిబంగ్ లోయ, తూర్పున లోహిత్ జిల్లా, పశ్చిమాన మాక్ మోహన్ రేఖతో బాటు అరుణాచల ప్రదేశ్ లోని తూర్పు, ఎగువ సియాంగ్ జిల్లాలు, అస్సాం లోని తిన్సుకియ జిల్లా దక్షిణాన ఉన్నాయి.

మంచుతో కప్పబడిన శిఖరాలు, కల్లోల నదులు, మార్మిక లోయలు, సమృద్ధిగా ఉన్న వృక్ష, జంతు సంపద రోయింగ్ లోని కొన్ని ఆకర్షణలు. దాని సహజ చక్కదనంతో బాటు, రంగురంగుల మనోహరమైన తెగలు, పురాతన పురావస్తు ప్రదేశాలు ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రేమికులు, సాహసప్రియ పర్యాటకులు, పురావస్తు శాస్త్రవేత్తలు, మానవ పరిణామ శాస్త్రవేత్తలకు ఒక ఉత్తమ గమ్య స్థానంగా మారుస్తుంది.

రోయింగ్ లోను చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

రోయింగ్ పర్యాటకులు తరచూ సందర్శించే సరస్సుల నుండి లోయలు, వన్యప్రాణి అభయారణ్యం వరకు విస్తరించిన ఎన్నో ప్రాకృతిక ఆకర్షణల నివాసం.

రోయింగ్ లోని కొన్ని ప్రధాన ఆకర్షణలలో సాలీ, మెహవో సరస్సు, మెహవో వన్యప్రాణి అభయారణ్యం వంటివి ఉన్నాయి. రోయింగ్ పురాతన పురాతత్వ ప్రదేశాలు భీష్మకర్, రుక్మిణి నతిలకు కూడా ప్రసిద్ధి. ప్రశాంత నీటి సరస్సులు, ఆకాశం నీలిరంగుని ప్రతిబింబించే ఎన్నో ఎత్తైన జలపాతాలు ఉన్న నదులు, కొన్ని సార్లు తలపైన ఎగిరినట్లుగా కనబడే మేఘాలు ఒక మంత్రముగ్ధమైన అనుభూతిని పర్యాటకులకు కల్గిస్తాయి. ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకొనే నిజమైన ప్రకృతి ప్రేమికులకు ఈ దాగిన స్వర్గం స్వాగతం పలుకుతుంది.

రోయింగ్ – భూమి, ప్రజలు

మిష్మి కొండ పాదాల దగ్గర ఉన్న ఈ పట్టణం స్నేహపూరితమైన ప్రజలతో నిండి ఉంది. మిష్మి, ఆది గిరిజనులు రోయింగ్లోని ప్రధాన వాసులు. ప్రతి ఏటా మిష్మిల పండుగ రెహ్ ను ఫిబ్రవరి లోను, ఆదిల పండుగ సోలంగ్ ను సెప్టెంబర్ 1 వ తేదిని ఎంతో వైభవంగా, ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ జిల్లాలో ఉన్న ఇతర రెండు తెగలలో ఇదు మిష్మి ఒకటి. ఇదు మిష్మి తెగవారిని ఇతర తెగల నుండి వారి ప్రత్యేక జుట్టు, విలక్షణమైన దుస్తులు, వారి బట్టలపై పొందుపరచబడిన కళాత్మక నమూనాల ద్వారా విభిన్నంగా గుర్తించవచ్చు. అరుణాచలప్రదేశ్ లోని ఈ తెగల వారు లోతుగా నాటుకు పోయిన కళా విలువలను, వారి రోజువారీ జీవితంలో గొప్ప గర్వం, గౌరవంతో ఈ నాటికి కూడా నిర్వహిస్తున్నారు.

రోయింగ్ సందర్శనకు ఉత్తమ సమయం

రోయింగ్ సందర్శనకు అక్టోబర్ లో మొదలై జనవరి వరకు ఉండే శీతాకాలం ఉత్తమమైనది. ఈ కాలంలోనే రోయింగ్ లోని సరస్సులు కాలువలు, తామరలతో నిండి, ప్రాకృతిక దృశ్యాల సందర్శన ఎంతో ఆహ్లాదకర౦గా ఉంటుంది.

రోయింగ్ చేరడం ఎలా

రోయింగ్ పట్టణాన్ని రకరకాల రవాణా సౌకర్యాల ద్వారా సులువుగా చేరవచ్చు. ఈ పట్టణానికి సరైన రైలుస్టేషన్ గాని, సరైన విమానాశ్రయం గాని లేవు. దగ్గరగా ఉన్న అస్సాంలోని తిన్సుకియ స్టేషన్ నుండి రైలు ఎక్కవచ్చు. అస్సాం నుండి రోయింగ్ ను ఇక్కడకు గల అనేక రోడ్డు మార్గాల ద్వారా సులువుగా చేరవచ్చు. రోయింగ్ పట్టణానికి పర్యాటకులు బస్సులు, టాక్సీలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఒక ప్రసిద్ధ రవాణా సౌకర్యం.

Please Wait while comments are loading...