Search
  • Follow NativePlanet
Share

మియావో   – ప్రశాంతతకు నెలవు !!

9

అస్సాం సరిహద్దు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియావో చాంగ్లాంగ్ జిల్లాలోని ఒక సబ్-డివిజన్. అత్యధిక వర్షపాతం ఉండే ఈశాన్య రాష్ట్రాలలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే మియావోను వర్ధమాన నగరంగా చెప్పుకోవచ్చు. మియావో గుండా నవో-దిహింగ్ అనే నది ప్రవహిస్తుంది, ఈ నది సముద్రమట్టానికి 213 అడుగుల ఎత్తున ఉంది. హిమాలయాలకు తూర్పువైపు విస్తరణగా ఉండే పాటకాయి బుం అనే పర్వతశ్రేణులు ఈ నగరం చుట్టూ ఉంటాయి.

మియావో – ఒక సంక్షిప్త సమీక్ష

ఎత్తైన అడవులు, చల్లటి వాతావరణం మియావోను అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాయి. దియున్, చౌఖం అనే రెండు ఊళ్లు మియావో ప్రాంతంలోనే ఉంటాయి. ఆసియా ఖండంలో ఒకప్పుడు సంపన్న గ్రామంగా పరిగణి౦చబడిన చౌఖం చెక్క వ్యాపారం ద్వారా డబ్బుగడించింది. చిన్న పట్టణమే అయినప్పటికీ మియావోకు మంచి రోడ్లు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఒక ప్రశాంతమైన పట్టణమే కాక, మియావోలో చాలా పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. నామ్దఫా టైగర్ ప్రాజెక్ట్, చిన్న జూ, ఓ మ్యూజియం, ఇతర ఆహ్లాదకర ప్రదేశాలతో ఈ పట్టణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అనేక హిందూ దేవాలయాలు, రివైవల్ చర్చ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, కాథలిక్ చర్చ్ లుకూడా మియావోలో ఉన్నాయి. పైగా, ఈ పట్టణంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఉన్నాయి. పిసి జాంగ్ ప్రచురించే స్థానిక వార్తలతో కూడిన “ద మియావో టైమ్స్” అనే వారపత్రిక కూడా ఇక్కడినుండే ప్రచురితమవుతుంది.

మియావోలోని స్థానికులు ప్రభుత్వోద్యోగులు కాగా, గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవారు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వ్యవసాయం, తేయాకు తోటలు మియావోలో ప్రసిద్ది చెందాయి. తాన్గ్సా, సింగ్ఫో, లిసు అనేవి మియావోలోని ప్రధానమైన తెగలు. మియావోలోని చౌకం పట్టణం ఉత్తర భాగంలో మిస్మిస్ తెగవారు నివసిస్తారు. పొడిగా ఉండే కొండ ప్రాంతంతో ఉండే ఈ భాగం, నల్లమందు పండించడానికి అనువుగా ఉంటుంది కనుక నల్లమందు ఇక్కడ ప్రసిద్ది చెందింది. తాన్గ్సా, సింగ్ఫో, అస్సామీ, హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాషలు.

మియావోలోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ప్రశాంతంగా ఉండే మియావో పట్టణంలో, బోర్డుమ్సా, నామ్సై, నామ్పొంగ్, జైరంపూర్ లాంటివి చూడదగ్గ ప్రధానమైన ప్రదేశాలు.

మియావో వాతావరణం

వేసవిలో మియావో సందర్సిస్తుంటే కాటన్ దుస్తులు, శీతాకాలంలో అయితే ఉన్ని దుస్తులు తప్పకుండా తీసుకువెళ్ళండి.

మియావో చేరుకోవడం ఎలా

చుట్టుపక్కల ప్రధాన నగరాలకు, పట్టణాలకు మియావో వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు కలిగిఉంది.

మియావో ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మియావో వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మియావో

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మియావో

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in మియావో
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా మియావో లో రైల్వే స్టేషన్ లేదు. మియావో – తీన్ సుకియా రైల్వే స్టేషన్ నుంచి 115 కిలోమీటర్లు, అస్సా౦ లోని మార్ఘేరిటా రైల్వే స్టేషన్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. మియావో కు దగ్గరి రైల్వే స్టేషన్ తీన్ సుకియా జంక్షన్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా : దిబ్రూఘర్ విమానాశ్రయం, తీన్ సుకియా రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరి కేంద్రాలు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu