నమ్పొంగ్, అరుణాచల్ ప్రదేశ్ లోని మరో ఆసక్తికరమైన పట్టణం. ఈ పట్టణం ఛంగ్లంగ్ జిల్లలో, పంగ్సా పాస్ కి దగ్గరలో ఉంది. 308 మీటర్ల ఎత్తున ఉండే నామ్పొంగ్ పూర్వం స్టిల్వేల్ రోడ్డుగా పిలువబడే లెడో రోడ్డుమీద ఉంది. జనరల్ జోసెఫ్ స్టిల్వేల్ పేరిట ఈ రోడ్డు ఏర్పడింది. తరచుగా సంభవించే భూకంపాలు, కఠినమైన పరిస్థితుల వల్ల ఈ ప్రాంతాన్ని “హెల్ పాస్” గా పిలిచేవారు. మయన్మార్ దేశంతో సరిహద్దు కలిగిన భారతదేశ తూర్పు భాగంలోని చిట్టచివరి పట్టణం నామ్పొంగ్. ఈ పాన్గ్సు పాస్ ద్వారా ప్రతినెలా ప్రజలని మయన్మార్ లోకి వెళ్ళడానికి అనుమతిస్తారు.
నమ్పొంగ్ లోని ప్రధానమైన తెగ తన్గ్సాస్ అయినప్పటికీ, తన్గ్సాస్ లోని తిఖాక్, ముక్లోం, హవి, లోన్గ్చంగ్, మోస్సంగ్, జుగ్లి, కిమ్సింగ్, పొంతై, సంగ్వాల్ లాంటి ఇతర ఉప తెగలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా తెగల మూలం మంగోల్ జాతిలో ఉందని చెప్తారు. మొదట్లో మయన్మార్ లోని మసోయి సినరుపం కొండవద్ద వెలుగులోకి వచ్చిన తన్గ్సాస్ అనే తెగవారు 18 వ శతాబ్దం తొలినాళ్ళలో ఈ ప్రాంతానికి వలస వచ్చారని ఇతిహాసం చెప్తుంది.
పూర్వం జంతుబలులను అనుమతించే బోన్ అనే మతాన్ని వీరు అనుసరించారు, అయితే కాలక్రమేణా వీళ్ళంతా బౌద్ధం లోకి, క్రైస్తవం లోకి మారిపోయారు. కలసికట్టుగా ఉంటూ, కష్టపడే తెగగా పేరొందిన తాన్గ్సాలు ప్రధానంగా రైతులు. తాన్గ్సాల ఆతిధ్యం కూడా ప్రసిద్ది పొందింది. నమ్పొంగ్ లోని పంగ్సు పాస్ లో ప్రతి ఏటా జనవరి 20, 21, 22 తేదీలలో జరిగే శీతాకాల ఉత్సవం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.