Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నమ్దఫా నేషనల్ పార్కు

నమ్దఫా నేషనల్ పార్కు

40

దట్టమైన సతతహరితారణ్యాలు ఈ నేషనల్ పార్కులో రాజ్యమేలుతున్నాయి. మిష్మి కొండలు, పట్కాయి శ్రేణులలో భాగమైన దఫా బం శ్రేణి, నమ్దఫా చుట్టూ ఉంది. ఇది మియో నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలోని 15 వ టైగర్ రిజర్వు పార్కు అయిన నమ్దఫా 1985 చ.కి.మీ వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ అడవి గుండా ప్రవహించే నోవా-దిహింగ్ నదిలో జలచర జాతులు ఉన్నాయి. నమ్దఫా నది కూడా ఈ పార్కు గుండా ప్రవహించడం వలననే పార్కు కు నమ్దఫా నేషనల్ పార్కు అనే పేరు వచ్చింది.

నమ్దఫా నేషనల్ పార్కు వన్యప్రాణి ఔత్సాహికుల కోసం ఎంతో ఉత్తమమైనది. ఇది సవాలే కాక ఉత్తేజకరమైనది కూడా, ఎందుకంటే వృక్ష, జంతుజాలాలు అసంఖ్యాకమైన జాతులు కనుగొనడానికి వేచి ఉన్నాయి. సాధారణ మిథున్, ఏనుగు, దున్న, సాంబార్, హిమాలయముల నల్ల ఎలుగుబంటి, టాకిన్, సాధారణ పాట్కోయి రకానికి చెందిన అడవి మేక, కస్తూరి జింక, నెమ్మది లోరిస్, బింతురాంగ్, ఎర్ర పాండా ఈ ప్రాంతంలో కనబడే కొన్ని జంతువులు. రకరకాల సీతాకోకచిలుకలు ఈ అడవి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

పులి, చిరుతపులి, మంచు చిరుత, మబ్బు చిరుత అనే నాలుగు చిరుతల రకాలు కేవలం నమ్దఫాలో అతి ఎత్తైన ప్రాంతాలలో కనబడతాయి. మంచు చిరుతలు ప్రస్తుత కాలంలో అతి అరుదైన జాతి. తెలుపు రెక్కల వడ్రంగిబాతు కూడా ఈ పార్కులో కనబడే అటువంటి అరుదైన పక్షి. అస్సామీ మెకాక్, పంది తోక మెకాక్, హూలాక్ గిబ్బన్, హార్న్బిల్స్, అడవి కోడి వంటి ఇతర జాతులు పార్కు అంతటా కనిపిస్తాయి. సాహసప్రియులు ఈ అడవిలో నివాసముండే పాములపట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది.

రకరకాల మొక్కలు కూడా ఇక్కడ కనబడతాయి. వానిలో కొన్ని 150 కలప జాతులు, మిష్మి తీట వంటి కొన్ని అరుదైన వనమూలికా మొక్కలు. నమ్దఫా నేషనల్ పార్కులో వృక్ష సంపద ఎత్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఒక రకానికి చెందిన వెదురుతో బాటుగా ఎత్తైన అడవులలో వెడల్పాటి ఆకుల చెట్లు ఇక్కడి కొన్ని రకాల వృక్షసంపద. గతంలో 425 పక్షి జాతుల అతి ఎత్తైన ప్రాంతాలలో ఎగురుతూ కనబడేవి.

కొన్ని గిరిజన తెగలు పార్కులో , ముఖ్యంగా భారతదేశ౦ భూభాగం తన సరిహద్దును మయాన్మార్ తో పంచుకొనే తూర్పు భాగంలో నివాసముంటాయి. చక్మ, తంగ్స, సింగ్ఫో తెగలు పార్కు చుట్టూ ఉన్న ప్రాంతాలలో కనబడతాయి.

నమ్దఫా నేషనల్ పార్కు చేరడం ఎలా

నమ్దఫా నేషనల్ పార్కు ప్రధానంగా రోడ్డుమార్గాల ద్వారా కలపబడింది. రైలు, రోడ్డు మార్గాల కోసం పర్యాటకులు అస్సాం చేరి అప్పుడు మియోకు ప్రయాణించవలసి ఉంటుంది.

నమ్దఫా నేషనల్ పార్కులో వాతావరణం

నమ్దఫా నేషనల్ పార్కును, అడవిని అన్వేషించడానికి ఉత్తమంగా ఉండే అక్టోబర్, ఏప్రిల్ మధ్య కాలంలో సందర్శించవచ్చు.

 

నమ్దఫా నేషనల్ పార్కు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నమ్దఫా నేషనల్ పార్కు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నమ్దఫా నేషనల్ పార్కు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నమ్దఫా నేషనల్ పార్కు

  • రోడ్డు ప్రయాణం
    దిబ్రూఘర్ , మియవో ల నుండి బస్సు లు నడుస్తాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు లభ్యం గా వుంటాయి. మియావో నుండి దేబాన్ 26 కి. మీ. ల దూరం లో కలదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ఈ ప్రదేశానికి తీన్ సుకియ రైలు స్టేషన్ సమీపం. ఇది దేబాన్ నుండి 141 కి. మీ. ల దూరం లో కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    మోహన్ బారి ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్. ఇది 182 కి. మీ. ల దూరం లో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri