ప్రయాణానికి ఉత్తమ కాలం: చల్లగా సౌకర్యవంతంగా ఉండే వేసవి కాలం, గోముఖ్ సందర్శించడానికి ఉత్తమ సమయం.
గోముఖ్ వేసవి కాలంలో మధ్యస్థ వాతావరణాన్ని కలిగి, సందర్శించడానికి అనువైన సమయంగా ఉంటుంది. వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్): వేసవికాలం ఏప్రిల్ నెలలో ప్రారంభమయి జూన్ వరకు కొనసాగుతుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 10 ° సెం మరియు 15° సెం వద్ద నమోదు చేయబడతాయి. ఈ స్థలం వేసవి కాలంలో కూడా మంచుతో కప్పబడి ఉంటుంది.
వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్): వర్షాకాలం జూలై లో మొదలయి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షం కురుస్తుంది. భూపాతాలు ఈ కాలంలో సాధారణం.
శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 0 ° సెం కంటే తక్కువకు పడిపోతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 10 ° C వద్ద నమోదు చేయబడుతుంది.