Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోపాల్పూర్ » వాతావరణం

గోపాల్పూర్ వాతావరణం

గోపాల్పూర్ వాతావరణం గోపాల్పూర్ లో ఏడాది పొడవునా ఒక మోస్తరు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, పర్యాటకులు ఈ ప్రాంతం అందించే ఆకర్షణీయమైన భూభాగంలో సేదతీరవచ్చు. గోపాల్పూర్ లో అనేక బడ్జెట్ హోటళ్ళు అలాగే విలాసవంతమైన హోటళ్ళు ఉన్నాయి. సాంస్కృతిక వారసత్వంతో పాటు ఈ ప్రదేశంలోని గొప్పదనాన్ని ఆనందించడానికి కుటుంబంతో, స్నేహితులతో ఈ సమయంలో గోపాల్పూర్ సందర్శించడం ఉత్తమం.

వేసవి

వేసవి వేసవి మార్చ్ నుండి మే మధ్య వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు ఉంటుంది. అయితే, సాయంత్రం సమయంలో ఈ పట్టణం మొత్తం కొద్ది మంచుతో కప్పబడి చాలా అందంగా ఉంటుంది. వేసవిలో సాయంత్రం సమయంలో నగరంలో తిరగడానికి, ప్రత్యేకంగా బీచ్ లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం గోపాల్పూర్ లో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. జూన్, జులై, ఆగస్ట్ నెలలలో సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది, అందువల్ల సంవత్సరంలో ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం సరైనది కాదు.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాల సమయం. ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుండి 27 డిగ్రీల వరకు ఉంటుంది. ఒరిస్సాలో ఈ అందమైన బీచ్ ని సందర్శించడానికి ఇదే ఉత్తమ సమయం. సూర్యుని వేడి తగ్గి, వాతావరణం చల్లగా, చలిగా ఉంటుంది. డిసెంబర్, జనవరి మాసాలలో రాత్రి సమయంలో చాలా చలిగా ఉంటుంది.