Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హేవ్ లాక్ ఐలాండ్ » వాతావరణం

హేవ్ లాక్ ఐలాండ్ వాతావరణం

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలైన ధాయ్ లాండ్ మరియు సింగపూర్ ల వలెనే పెద్ద మార్పులు లేకుండా సంవత్సరమంతా ఒకే విధమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ దీవులను సందర్శించాలంటే అక్టోబర్ నుండి మే వరకు అనుకూలం.

వేసవి

వేసవి వేసవి కాలం అధిక వేడి మరియు తేమ కలిగి ఉంటుంది. కనుక ఈ సమయం పర్యటనకు అనువైనది కాదు. సాధారణంగా చాలామంది పర్యటనకు రారు. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలనుండి 36 డిగ్రీ సెల్షియస్ వరకు చేరి అసౌకర్యం కలిగిస్తాయి. ఈ ప్రాంతం భూ మధ్య రేఖకు సమీపంగా ఉంది.  

వర్షాకాలం

వర్షాకాలం వేసవి గడచిన మే నెల తర్వాత ఈ ప్రాంతం ప్రత్యేకించి పోర్ట్ బ్లెయిర్, అండమాన్ మరియు నికోబార్ దీవులు సంవత్సరంలోని వర్ష రుతువులో అధిక వర్షమే పొందుతాయి. సగటు వర్షపాతం సుమారు 3000 మి.మీ.లుగా ఉండి ఉష్ణోగ్రతలు ఈ కాలంలో 24 డిగ్రీలుగా ఉంటాయి.  

చలికాలం

శీతాకాలం అండమాన్ మరియు నికోబార్ దీవులలో శీతాకాలం అసలు శీతాకాలం వలే ఉండదు. పగటి ఉష్ణోగ్రతలు 24 నుండి 30 డిగ్రీల రేంజిలో ఉంటాయి. అయితే రాత్రులలో హాయిగా ఉంటుంది.