Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హోగెనక్కల్ » వాతావరణం

హోగెనక్కల్ వాతావరణం

హోగేనక్కల్ దర్శించటానికి అక్టోబర్-మార్చ్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నది ప్రవాహం సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు నదిలో బోటింగ్ సురక్షితంగా చేయవొచ్చు. కొరకిల్ బోటింగ్ మరియు మేల్లగిరి హిల్స్ గుండా ట్రెక్కింగ్ చేస్తూ, పర్యాటకులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.

వేసవి

వేసవికాలం : ఇక్కడ వేసవికాలంలో నులివెచ్చగా ఉంటుంది. ఎక్కువ వేడి ఉండదు. వేసవికాలం మార్చ్ నెల నుండి మొదలై మే నెల వరకు ఉంటుంది. ఇక్కడ ఈ సమయంలో ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 34 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ ఉష్నోగ్రతల మూలంగా, పర్యాటకులు ఈ కాలంలో హోగేనక్కల్ సందర్శించటానికి ఇష్టపడరు.

వర్షాకాలం

వానాకాలంఇక్కడ వానాకాలం సాధారణంగా జూన్ నెల నుండి ఆగష్టు నెల వరకు ఉంటుంది. ఈ గ్రామం నది దగ్గర ఉండటంవలన, చుట్టూ దట్టమైన అడవి ఉండటంవలన 'హోగేనక్కల్' ప్రకృతి ఆరాధకులకు ఈ నెలల్లో ఒక ట్రీట్ అవుతుంది. ఈ కాలంలో నది ప్రవాహం పెరుగుతుంది మరియు అడవులు వానల్లో తడిసి కన్నులకింపుగా ఉంటుంది. అయినప్పటికీ, పర్యాటకుల సంఖ్య ఈ కాలంలో తక్కువగానే ఉంటుంది.

చలికాలం

శీతాకాలంహోగేనక్కల్ శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో అత్యదిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 13 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటాయి. ఈ సమయంలో హోగేనక్కల్ సందర్శించటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వొస్తారు.