చార్మినార్, హైదరాబాద్

క్రి.శ. 1591  లో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత చార్మినార్ నిర్మించబడినది. ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి ఈ చార్మినార్ ముఖ్యమైన కట్టడం గా పేరొందింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ చారిత్రక నిర్మాణం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. చార్మినార్ పేరు 'చార్' మరియు 'మినార్' అనే రెండు ఉర్దూ పదాల నుండి వచ్చింది.

చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అని అర్ధం. ప్రాచీన కాలం నాటి అద్భుతమైన నిర్మాణ శైలి వైభవం ఈ కట్టడం సొంతం. ఈ నాలుగు స్థంభాలలో కనిపించే నిర్మాణ శైలి నాలుగు చక్కటి కమానులతో అనుసంధానమై ఉంది. స్థంభాల కి సహకారంగా ఈ కమానులు ఉంటాయి. గోల్కొండ నుండి హైదరాబాద్ ని రాజధానిగా మార్చడానికి ఖులీ ఖుతుబ్ షా వెళ్ళిన తర్వాత ఈ చార్మినార్ నిర్మాణం పూర్తయింది.

ఈ స్మారక చిహ్నం నగరం లో నుండి అంటు వ్యాధి అయిన ప్లేగు వ్యాధిని నిర్మూలించిన దైవ శక్తుల కి కృతజ్ఞతా భావం తో నిర్మింపబడినది. తన గాంభీర్యం తో వేల మంది పర్యాటకులని ఈ చార్మినార్ ఆకర్షిస్తోంది. అంతే కాదు, ఈ ప్రదేశం లో కనబడే పురాతన ప్రపంచపు వైభవం కూడా పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.

Please Wait while comments are loading...