Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » వాతావరణం

ఇడుక్కి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయంఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఇడుక్కి ని ఏ సమయం లో నైనా సందర్శించవచ్చు. వర్షాకాలం ఇందుకు మినహాయింపు. ఇడుక్కి ని సందర్శించేందుకు ఎండాకాలం అనువైనది. నవంబర్ నుండి జనవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయంలో ఇడుక్కిని సందర్శించేటప్పుడు శీతాకాల దుస్తులని వెంట తీసుకెళ్ళడం ఉత్తమం.

వేసవి

ఎండాకాలం:ఇడుక్కి లో ఎండాకాలం అతి తక్కువ సమయం అంటే మూడు నెలల కాలం వరకే ఉంటుంది. మార్చ్ నుండి మే వరకు ఇక్కడ ఎండాకాలం. అయినప్పటికీ ఇక్కడ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ మాత్రమే చేరుకోవడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఇడుక్కి ని సందర్శించవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం :జూన్ నెలలో ప్రారంభమైన వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా మారుతుంది. ట్రెక్కింగ్ లేదా ఇతర సాహసకృత్యాలకు ఈ వాతావరణం అనువైనది కాదు. వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం సిఫార్సు చేయదగినది కాదు.

చలికాలం

శీతాకాలం :ఇడుక్కి లో శీతాకాలం సుదిర్ఘమైనది. వాతావరణం బాగా చల్లగా మారుతుంది. ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కి చేరుతుంది. అక్టోబర్ నెలలో చలి తీవ్రమయి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఇడుక్కి పర్యటన చేసే పర్యాటకులు ఖచ్చితంగా ఉన్ని వస్త్రాలు, స్వెట్టర్లు మరిచిపోకూడదు.