India
Search
 • Follow NativePlanet
Share
» »ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్‌కు భిన్న‌మైన ప్ర‌యాణమే ఉత్త‌మ మార్గం!

ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్‌కు భిన్న‌మైన ప్ర‌యాణమే ఉత్త‌మ మార్గం!

ఎప్పుడూ రొటిన్‌గా ఇంట్లోనే గడపకుండా కొత్త ప్రదేశాలను చూడటానికి ప్రణాళిక వేసుకుంటే మంచిది. ఇలా చేయటం వల్ల మానసికంగా ఆనందంగా ఉంటారు. అందుకే, రకరకాల జీవన విధానాలను అధ్యయనం చేయటాన్ని పర్యాటక ప్రేమికులు ఇష్టపడతారు.

కొత్త ప్రదేశాలకు వెళ్లటం.. భిన్నమైన సంస్కృతులను తెలుసు కోవటం.. ప్రయాణం అనేది జీవితానికి కొంత విశ్రాంతిని, నూతన ఉత్సాహాన్నిస్తుంది. అలాగే చేసే పనిలో నైపుణ్యతను పెంచుతుంది. మీ ప్రయాణాన్ని కాస్త రొటీన్‌కు భిన్నంగా మోడ్ర‌న్‌గా మార్చేయండి!

Andrapradesh -Touirist places-1

ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్‌కు భిన్న‌మైన ప్ర‌యాణమే ఉత్త‌మ మార్గం!

నిత్యం పనుల ఒత్తిడి వల్ల జీవితాన్ని భారంగా గడుపుతుంటారు చాలామంది. ఇలా జీవితం మొత్తం పనుల్లో గడపటం వల్ల తెలియకుండానే సంతోషానికి దూరం అవుతున్నారు. ఈ ఒత్తిడి భారం మొత్తం పనిపై పడటం వల్ల పనిలో నైపుణ్యత తగ్గుతుంది, క్రమంగా జీవితం పట్ల విరక్తి ఏర్పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి పనిలో ఎదుగుదల కనిపించాలంటే ప్రయాణం తప్పని సరి..! ''ప్రయాణం చేయటం వల్ల 80 శాతం తమ పనుల్లో విజయం సాధిస్తారట. ''ప్రయాణం చేసిన తరువాత కలిగే ఆనందం మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే.

దాంతో పాటు మెదడుకు ప్రశాంతత చేకూరటంతో పాటు, పనిలో ఉత్పాదక శక్తి పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే భయంకరమైన ఒత్తిడి నుండి బయటపడాలంటే విశ్రాంతి తీసుకోవాల్సిందే. ఉద్యోగం చేసే వారు ప్రయాణం చేయటం వల్ల ఎంతో విశ్రాంతిని పొందుతారట, అలాగే పని పట్ల అంకితభావం పెరగటంతో పాటు, ఆత్మవిశ్వాసం, సామర్థ్యం ఇనుమడిస్తాయి. ప్రస్తుతం ఉన్న సంస్థలు ప్రయాణం వల్ల కలిగే ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులకు ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలను, విశ్రాంతిని కల్పిస్తున్నాయి.అలాగే మానవ వనరుల సంస్థలు ఉద్యోగుల కోసం ట్రావెల్‌ అలవెన్సులు ఇస్తున్నాయి. కాబట్టి రొటీన్‌కు భిన్న‌మైన ప్రయాణం చేయటం వల్ల కలిగే లాభాలను చూద్దాం.

- ప్రయాణం చేయటం వల్ల మనిషికి, ప్రకృతికి ఉన్న సంబంధబాంధవ్యాలు బయట పడతాయి. ప్రయాణం వల్ల వచ్చే అనుభూతి మన ఆలోచన విధానాన్ని మార్చుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ప్రయాణం చేయటం వల్ల తెలియకుండానే నాయకత్వపు లక్షణాలు అలవడుతాయి.

Andrapradesh-2

- ఆందోళనను దూరంగా ఉంచటంలో దీని పాత్ర కీలకం. అలాగే మానసికంగా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంచటానికి సహయపడుతుంది. ప్రయాణం వల్ల ముఖ్యంగా యాంత్రిక జీవితానికి, నిజ జీవితానికి తేడా తెలుస్తుంది. కొత్త ప్రదేశాలను, మనుషుల జీవన విధానాన్ని చూడగల్గుతారు. దాంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో కూడా కుంగుబాటుకు లోనుకాకుండా నిలబడ గల శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. నెమ్మదిగా ఉండటం వల్ల నిర్మలంగా కనిపించటంతో పాటు పని పట్ల నిబద్ధత పెరుగుతుంది.

- విశ్రాంతి తీసుకోవటం వల్ల మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది. ప్రయాణ సమయంలో ఆత్మాన్వేషణతో పాటు వ్యక్తిగత సామర్థ్యాన్ని గుర్తించగల్గుతారు. అలాగే బలహీనతలను గుర్తించి వాటిని అదుపులో ఉంచుకునే శక్తిని పొందుతారు. దాంతో పాటు పనుల్లో లోటుపాట్లను తెలుసుకోవటంతో పాటు పునర్‌ ఉత్పత్తిశక్తిని పెంచుకుంటారు.

- పర్యాటకులు ఎక్కువగా కొత్త ప్రదేశాలను సందర్శించటానికి ఇష్టపడతారు. ఇలా ప్రయాణం చేయటం వల్ల వ్యక్తిగతంగా, వృతిరీత్యా అభివృద్ధి చెందుతారు. సన్నిహితులతో కలిసి ప్రయాణం చేయటం వల్ల సంబంధబాంధవ్యాలు మరింత బలపడుతాయి. దాంతో పాటు కొత్త అవకాశాలను, రకరకాల సంస్కృతులను తెలుసుకుంటూ వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోగల్గుతారు. ఇలా ప్రయాణం చేయటం వల్ల ఒకానొక సమయంలో తెలియకుండానే దయ, జాలి అనే గుణాలు జంతువుల పట్ల, పక్షుల పట్ల మనుషుల పట్ల కలుగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోగల్గుతారు. కొత్త వాతావరణంలో ఏర్పడే సంబంధాలు సంతోషకరమైన జీవన విధానానికి, వృతిరీత్యా ఎదుగుదలకు తోడ్పడుతాయి.

  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X